E-Paper
Advertisement

Flipkart GOAT Sale 2024: కొత్త సేల్ స్టార్ అయింది.. ఈ ఫోన్లపై ఫుల్ డిస్కౌంట్స్!

Flipkart GOAT Sale 2024: కొత్త సేల్ స్టార్ అయింది.. ఈ ఫోన్లపై ఫుల్ డిస్కౌంట్స్!
Advertisement

Flipkart GOAT Sale 2024: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ GOAT Sale 2024‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా కుప్పలు కుప్పలుగా ఆఫర్లు తీసుకొచ్చింది. ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ టీవీలు, స్పీకర్లు, ఇతర గ‌ృహోపకరణాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ జులై 20 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు జులై 19 అంటే ఈ రోజు నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులోకి వస్తాయి.

ఈ సేల్ ఫెయిర్ సందర్భంగా ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొత్త ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ ఫెయిర్ జూలై 25 వరకు కొనసాగుతుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. క్రెడిట్, డెబిట్ కార్డులపై తగ్గింపులు కూడా లభిస్తాయి. మీరు ఈ సేల్‌లో వస్తువుల లేదా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలంటే ఆఫర్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Advertisement

Google Pixel 7
గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ 6.32-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ టెన్సర్ G2 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 32,999కి అందుబాటులో ఉంటుంది.

Motorola G34 5G
మోటరోలా జీ 34 5జీ మొబైల్‌లో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది పంచ్-హోల్ డిజైన్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే. అలానే ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14 OS సపోర్ట్‌తో పని చేస్తుంది. 5,000mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 9,999కి అందుబాటులో ఉంటుంది.

Advertisement

Motorola Razr 50 Fusion
మోటరోలా రేజర్ ఫోన్ 2400 × 1080p పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వీటితో పాటు ఫోన్‌లో పవర్‌ఫుల్ Qualcomm Snapdragon 7s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. Android 14 OS సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB + 128GB, 12GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఇందులో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో పాటు 5,000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×