BigTV English

Rain Alert in Telangana: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశాలు

Rain Alert in Telangana: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశాలు
Heavy rains in Telangana(Telangana rainfall update): తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఐదురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతోపాటు అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి. భూపలపల్లి, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. శనివారం ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షలు పడతాయని ఐఎండీ తెలిపింది. కావున అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. జిల్లా అధికారులతో టెలీకాన్పరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనే నిర్లక్ష్యం చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రజల సంరక్షణకే మొదటి ప్రధానమని, సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి సహాయ, సహకారాలు అందింస్తామని స్పష్టం చేశారు.
ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. చెరువులు, కుంటలు తెగిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పెద్ద వాగు వరద పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తడంతో రైతులు వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎస్ శాంతి కుమారి ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో పునరావాస చర్యలపై చర్చించారు.
పెద్దవాగుకు ఒక్కసారిగా వరదలు రావడంతో మూడు గేట్లు ఎత్తారు. దీంతో సమీపంలో ఉన్న నాలుగు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అయితు ఇందులో చిక్కుకున్న 28 మందిని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ బృందాలు రెండు హెలికాప్టర్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ జితేష్ తెలిపారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయని వెల్లడించారు. అయితే, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×