BigTV English

CM Revanth America Tour: అమెరికాకు సీఎం రేవంత్..షెడ్యూల్ ఇదే

CM Revanth America Tour: అమెరికాకు సీఎం రేవంత్..షెడ్యూల్ ఇదే

CM Revanth America Tour: సీఎం రేవంత్ రెడ్డి మరో విదేశీ పర్యటన ఖరారైంది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం అమెరికా పర్యటన ఖరారైనట్లు సీఎంవో ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన అమెరికాకు బయలు దేరనున్నారు.


రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది. అగ్ర రాజ్యంలోని డల్లాస్ వంటి రాష్ట్రాల్లో ఈ బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అగ్ర రాజ్యంలోని పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు. వారితో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల గురించి వారికి చెప్పి ఇన్వెస్ట్మెంట్లు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురానున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఎంతటి అనువైన ప్రాంతమో వివరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఎనిమిది రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటించి రేవంత్ రెడ్డి బృందం తిరిగి ఆగస్టు 17 వ తేదీన హైదరాబాద్‌కు చేరుకోనుంది.


Also Read: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. హైడ్రా చైర్మన్‌గా ముఖ్యమంత్రి

ఈ పర్యటనలో గతం కంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలని సీఎం టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి స్విర్ఖర్లాండ్‌తో పాటు ఇతర దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక ద్వారా భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చారు. దాదాపు 4 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఈ పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×