E-Paper
Advertisement

BIG TV Chairman Vijay: తెలుగులో ఆదరించినట్లు మలయాళీలు ఆదరిస్తారని కోరుకుంటున్నా!

BIG TV Chairman Vijay: తెలుగులో ఆదరించినట్లు మలయాళీలు ఆదరిస్తారని కోరుకుంటున్నా!
Advertisement

Logo Launch of BIG TV Malayalam: తెలుగు మీడియా రంగంలో భయం లేని మీడియా సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న BIG TV.. ఇక కేరళలో సత్తా చాటబోతోంది. వార్తల్లో కనికట్టు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేర్చే బాధ్యతను తలకెత్తుకోబోతోంది. తాజాగా BIG TV Malayalam ఛానెల్ లోగోను కేరళలో ఆవిష్కరించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో BIG TV  గ్రూప్ చైర్మెన్ విజయ్ తో మలయాళం, తెలుగు ఎడిటోరియల్ సభ్యులు పాల్గొన్నారు.

మలయాళంలోనూ భయం లేని మీడియా..

తెలుగులో మాదిరిగానే మలయాళంలోనూ భయం లేని మీడియా BIG TV సత్తా చాటబోతుందన్నారు చైర్మెన్ విజయ్. BIG TV మలయాళం లోగో ఆవిష్కరణ తర్వాత మాట్లాడిన ఆయన, కీలక విషయాలు వెల్లడించారు. “2022లో తెలుగు న్యూస్ చానెల్ ను ప్రారంభించాం. నాటి నుంచి నేటి వరకు భయం లేని మీడియా సంస్థగా కొనసాగుతున్నాం. శాటిలైట్ చానెల్ తో పాటు డిజిటల్ మీడియాలోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మంచి మీడియా సంస్థగా సత్తా చాటుతున్నాం. ఇప్పుడు మలయాళంలోకి అడుగు పెట్టాం. త్వరలో కన్నడలోకి అడుగు పెట్టబోతున్నాం. మలయాళ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకుల మాదిరిగానే BIG TV మలయాళం ఛానల్‌ కు సపోర్టు చేస్తారని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు చూపిన ప్రేమ, నమ్మకం వల్లే BIG TV ఇంత బలంగా ఎదిగి, విస్తరించింది. అదే పునాది మీద మలయాళంలోకి అడుగుపెడుతున్నాం” అన్నారు.

నిరంతరం ప్రజల గొంతుకగా ఉంటాం..

Advertisement

ఇకపై BIG TV మలయాళీ ప్రజల గొంతుకగా ఉండబోతుందన్నారు చైర్మెన్ విజయ్. “మేము నిష్పక్షపాత, విశ్వసనీయత కలిగిన మీడియా సంస్థగా కొనసాగుతున్నాం. ప్రజల గొంతుగా ఉండే విషయంలో ఎప్పుడూ నిబద్ధత కలిగి ఉన్నాం. తెలుగు ప్రజలు మా మీద ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారో, అదే నమ్మకాన్ని, విలువలను BIG TV మలయాళంలోనూ అమలు చేస్తాం. మలయాళ ప్రజలకు నిజాయితీగా, నిర్భయంగా, ప్రజల కోసం పనిచేసే జర్నలిజాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం” అన్నారు.

Advertisement

అటు BIG TV మలయాళం  ఎడిటోరియల్ టీమ్‌ మెంబర్స్ అనిల్, సుజబ్, జోషి, వేణు, లక్ష్మికి.. చైర్మెన్ విజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. కేరళ మీడియా రంగంలో వీరంతా అద్భుతంగా పని చేశారని, అదే ఒరవడిని BIG TV మలయాళంలోనూ కొనసాగించాలన్నారు. “నేను ఎన్నడూ కంటెంట్ విషయంలో జోక్యం చేసుకోలేదు. అదే మా చానెల్ బలం. BIG TV మలయాళంలోనూ అదే పద్దతిని కొనసాగించబోతున్నాను. అద్భుతమైన ఎడిటోరియల్ నిర్ణయాలతో తెలుగులో BIG TVని నిర్భయ మీడియాగా తీర్చిదిద్దాం. అదే జర్నలిజాన్ని ఇప్పుడు మలయాళ ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. BIG TV మలయాళం, కేరళ మీడియా రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. మలయాళ ప్రేక్షకుల నుంచి తెలుగు ప్రేక్షకుల లాంటి ప్రేమ, మద్దతు ఆశిస్తున్నాను” అని చైర్మెన్ విజయ్ చెప్పుకొచ్చారు.

Read Also:  బిగ్ టీవీ మలయాళం ఛానెల్.. కొత్త లోగో ఆవిష్కరించిన ఛైర్మన్ విజయ్

 

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×