E-Paper
Advertisement

The Raja Saab OTT : ఆ దేశంలో ‘ది రాజా సాబ్’ ఓటీటీ స్ట్రీమింగ్ లేదు… అసలు కారణం ఏమిటి?

The Raja Saab OTT : ఆ దేశంలో ‘ది రాజా సాబ్’ ఓటీటీ స్ట్రీమింగ్ లేదు… అసలు కారణం ఏమిటి?
Advertisement

The Raja Saab OTT : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab). ఈ హర్రర్ కామెడీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో ఓటీటీలో అడుగుపెట్టింది. 2026లో వచ్చిన అతిపెద్ద చిత్రాలలో రాజా సాబ్ కూడా ఒకటి. ఎక్కువ మంది ప్రేక్షకులు దీనిని థియేటర్లలో చూడకపోవడంతో ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినా ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీలో కొన్ని అడ్డంకుల్ని కూడా ఎదుర్కొంటోంది ? అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అక్కడ మాత్రం అందుబాటులో లేదు

ఈ సినిమా ఈ నెల 6 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం USAలో అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో లేదు. ఇది అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. జియో హాట్‌స్టార్ భారతదేశంలో మాత్రమే పనిచేస్తున్నందున, ఈ సినిమా US ప్రాంతంలో చూసేందుకు అందుబాటులో లేదు. సాధారణంగా హాట్‌స్టార్ కంటెంట్‌లో ఎక్కువ భాగం హులు ఓటీటీతో కనెక్ట్ అవుతుంది. కానీ ‘ది రాజా సాబ్’ ప్రస్తుతం అక్కడ ప్రసారం కావడం లేదు. ఇది చాలా మంది NRI లను కూడా నిరాశపరిచింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం త్వరలో అమెరికాలోని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. కానీ USAలో ఖచ్చితమైన స్ట్రీమింగ్ తేదీ గురించి సమాచారం రావాల్సిఉంది.

ది రాజా సాబ్ హిందీ వెర్షన్ అప్‌డేట్

Advertisement

ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో లేదు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు మారుతి ఓటీటీ విడుదల తర్వాత కూడా ఎక్కడా కనిపించడం లేదు. హిందీ వెర్షన్ విడుదల లేకపోవడం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. మరి కొద్దిరోజుల్లో హిందీ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన రాజా సాబ్ ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఒకటి. ఇక ప్రభాస్ విషయానికొస్తే, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Read Also :  మతిపోగొట్టే ట్విస్టులు… థియేటర్లలో దుమ్మురేపుతున్న ఈ సూపర్ హిట్ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×