E-Paper
Advertisement

Bandi Sanjay: ధనవంతులకు కాదు.. గుణవంతులకు ఓటు వేయండి: బండి సంజయ్

Bandi Sanjay: ధనవంతులకు కాదు.. గుణవంతులకు ఓటు వేయండి: బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణకు బండి సంజయ్ ఏం తీసుకురాలేదని కొంతమంది అంటున్నారని, కానీ రాష్ట్రానికి ఏది కావాలో దానికి పక్కగా నిధులు తీసుకువచ్చానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థులకు మద్దతుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. 11 సంవత్సరాలుగా బిఆర్ఎస్ నాయకులు హుస్నాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా దోచుకొని పీల్చి పిప్పి చేశారని ఆరోపించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేశారే తప్ప, హుస్నాబాద్ కు బిఆర్ఎస్ తెచ్చి ఇచ్చిందేమీ లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ డబ్బులు ఖాళీ చేసి ఫామ్ హౌస్ లో ఉంటున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కోసుకొని వండుకొని తిన్న తన దగ్గర డబ్బులు లేవంటున్నాడని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా పువ్వు పువ్వు అంటున్నారని, హుస్నాబాద్ కు నిధులు కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే డిల్లీ నుండి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదన్నారు.

5 సంవత్సరాలు నరకం

గుణవంతులకు ఓటు వేస్తే మన దగ్గరికి వస్తారని, ధనవంతులకు ఓటు వేస్తే మనమే వాళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అన్ని మున్సిపాలిటీలలో ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, హుస్నాబాద్ మున్సిపాలిటీని బిజెపికి అప్పగిస్తే తాను ముందుండి అభివృద్ధి చేస్తానన్నారు. దేనికి నిధులు కావాలో ప్రధాని మోదీ ఆలోచించి నిధులు ఇస్తారని, తెలంగాణలో మున్సిపాలిటీలను గెలిపిస్తే అన్ని రకాల నిధులు ఇస్తానని ప్రధాని మోడీ చెప్పారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఓటు వేసే 11 వ తేదీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు నరకం చూస్తారన్నారు. బిజెపి అభ్యర్థులను గెలిపించి అవకాశం ఇవ్వాలని, వారు అవినీతి, కబ్జాలు, పార్టీలు మారితే అసలే ఊరుకోనన్నారు. హుస్నాబాద్ లో ఇదివరకు కాంగ్రెస్, బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు బిజెపి కి కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: Gaddam Vivek: ఆ ఇద్దరి నిర్ణయాలతోనే మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం: మంత్రి గడ్డం వివేక్

ఈ కార్యక్రమంలో..

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, కో కన్వీనర్ వేణుగోపాలరావు, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, మున్సిపల్ 20 వార్డుల బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులు లక్కిరెడ్డి తిరుమల, తోట స్వరూప, కందుకూరి శంకర్ బాబు, రాయికుంట చందు, తోట సమ్మయ్య, తగరం లక్ష్మణ్, లకావత్ శారద, కాదాసు దీపిక, మల్లం ప్రశాంత్, ఎర్రవెల్లి ప్రశాంత్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బొలిశెట్టి సురేష్, కృష్ణవేణి, బొడిగ శారద,గౌరవేణి మనమ్మ, వేల్పుల కళ్యాణి, సుద్దాల సరిత, ఇల్లందుల స్రవంతి, బత్తుల రమాదేవి, వరయోగుల మురళీధర స్వామి, సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్, గుత్తికొండ విద్యాసాగర్,లక్ష్మణ్, గాదాసు రాంప్రసాద్, అనంత స్వామి, నియోజకవర్గ బిజెపి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Kushi Kapoor: బికినీ అందాలతో హీట్ పుట్టిస్తున్న ఖుషీ కపూర్!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×