E-Paper
Advertisement

ఓ డీఎస్‌.. ఓ పొన్నాల‌.. ఓ కేకే తాజాగా జీవ‌న్ రెడ్డి.. గ‌తంలో సీనియ‌ర్ల ప‌రిస్థితుల‌ను గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌..

ఓ డీఎస్‌.. ఓ పొన్నాల‌.. ఓ కేకే  తాజాగా జీవ‌న్ రెడ్డి..  గ‌తంలో సీనియ‌ర్ల ప‌రిస్థితుల‌ను గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌..
Advertisement

అవ‌మానించ‌బడ్డామ‌ని కొంద‌రు.. అధికారం కోసం మ‌రికొంద‌రు పార్టీలు మార‌డం స‌హ‌జం. అవ‌త‌ల పార్టీలో చేరిన త‌రువాత గానీ తెల‌వ‌దు వారిచ్చే మ‌ర్యాద‌, మ‌న్న‌న‌లు. అంత‌కు మించిన అవ‌మానం జ‌రిగినా ఏం అన‌లేని ప‌రిస్థితే ఉంటుంది కొన్ని స‌మ‌యాల్లో కొంద‌రికి. కొంద‌రు త‌మ పార్టీలోకి ఆహ్వానించేట‌ప్పుడు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతారు. ఆ త‌రువాత వారిచ్చు మ‌ర్యాద చూస్తూ పారిపోవాల‌నిపిస్తుంది. కానీ ఏమి చేయ‌లేని నిస్స‌హాయ‌త వ‌చ్చేస్తుంది. కొంద‌రు మ‌ళ్లీ పార్టీ జంప్ అవుతారు. కొంద‌రు అందులోనే మ‌న‌లేక మౌనంగా ఉండిపోతారు. ఇంకొందరు రాజ‌కీయాల‌కే దూర‌మ‌వుతారు. ఇప్ప‌డు ఈ ముచ్చ‌టంతా ఎందుకంటే.. తాజాగా జీవ‌న్‌రెడ్డి పార్టీ మారిన నేప‌థ్యంలో. ఆయ‌న ఇవాళ ఎర్ర‌వ‌ల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ను క‌ల‌వనున్నారు. ఇద్ద‌రూ క‌లిసి లంచ్ చేస్తారు. జీవ‌న్ రెడ్డి పార్టీలో చేరే అంశంపై.. మీటింగుపై స‌మాలోచ‌న‌లు చేస్తారు.

కేసీఆర్‌తో వ్య‌వ‌హారం మొద‌ట మంచిగానే ఉంటుంది. ఆయ‌న ఆహ్మానించే తీరు.. ఇచ్చే మ‌ర్యాద మొద‌ట్లో ఎంతో ఆక‌ట్టుకుంటుంది. కానీ పార్టీలో చేరిన త‌రువాతే క‌ట్టు బానిస‌లా ప‌డి ఉండేలా ఉంటుందంటారు సీనియ‌ర్లు చాలా మంది. దీనికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు కూడా చెబుతారు. చాలా ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉండి, వివిధ కార‌ణాల‌తో కాంగ్రెస్‌ను వీడి కేసీఆర్ పంచ‌న చేరిన పెద్ద‌ల ఉదంతాలు ఇప్పుడు ఆ పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. జీవ‌న్‌రెడ్డి పార్టీ మారిన తరువాత ఆయ‌న మాట్లాడే మాట‌లో కూడా స్ప‌ష్ట‌మైన మార్పు వైఖ‌రి క‌నిపించింది. మాట‌ల్లో విప‌రీత‌మైన తేడా గుర్తించారు. అంతే కాదు.. ఏకంగా మోడీ బెట‌ర్ అని జీవ‌న్‌రెడ్డి అనడంపైనా మండిప‌డ్డారంతా. అందుకే గ‌తంలో కాంగ్రెస్‌ను వీడి బీఆరెస్‌లో చేరిన నాయ‌కుల పేర్ల‌ను ఈ సంద‌ర్భంగా ఉటంకిస్తున్నారు.

Advertisement

డీఎస్‌, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, కేకే లాంటి వాళ్లు అస‌లు పార్టీ మారుతార‌ని ఎవ‌రూ అనుకోలేదు. రాజ‌కీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్‌ను వీడుతార‌ని ఊహించ‌లేదు. కానీ అప్ప‌టి ప‌రిస్థితులు, అధికారం .. తదిత‌ర కార‌ణాల కోణాల్ల ఆలోచించుకుని కీల‌క నేత‌లు పార్టీని వీడారు. కేసీఆర్‌తో జై కొట్టారు. కానీ ఓ జాతీయ పార్టీలో ప్ర‌ధానంగా కాంగ్రెస్‌లో ఉన్న వాక్‌స్వాతంత్రం, వెసులుబాటు ప్రాంతీయ పార్టీలో అదీ కేసీఆర్ లాంటి నేత బలంగా అన్నీ తానై న‌డిపిస్తున్న బీఆరెస్‌లో అస‌లే ఉండ‌ద‌ని కొద్ది రోజుల్లోనే ఆయా నేత‌ల‌కు అర్థ‌మైపోయింది. ఆ త‌రువాత వారి పరిస్థితి పార్టీలో ఏమైందో జ‌నం కూడా క‌ళ్లారా చూశారు. చూస్తున్నారు.

ఇప్ప‌టికీ స‌బితా ఇంద్రారెడ్డిని కూడా ట్రోల్ చేస్తుంటారు కాంగ్రెస్ సోష‌ల్ మీడియా. అప్పుడు వైఎస్ హ‌యాంలో ఆమెకిచ్చిన స్థానం ఏలా ఉండే.. ? ఇప్పుడు బీఆరెస్‌లో కేటీఆర్ ద‌గ్గ‌ర ఆమెకున్న ప్రయార్టీ ఏపాటిది? అనే వ్య‌త్యాసాల‌ను పోల్చి చూపుతున్నారు. తాజాగా జీవ‌న్‌రెడ్డ్ కూడా పార్టీని వీడి బీఆరెస్‌లో చేర‌డంతో గ‌తంలో డీఎస్‌, కేకే, పొన్నాల ప‌రిస్థితి ఎలా అయ్యిందో చూశాం క‌దా.. ఇప్పుడు అదే లిస్టులో జీవన్ రెడ్డి చేరాడ‌ని వారు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×