E-Paper
Advertisement

Hot Water: ఈ వస్తువులను వేడినీళ్లతో శుభ్రం చేస్తే అంతే సంగతులు, పాడపోవడం గ్యారెంటీ

Hot Water: ఈ వస్తువులను వేడినీళ్లతో శుభ్రం చేస్తే అంతే సంగతులు, పాడపోవడం గ్యారెంటీ
Advertisement

సాధారణంగా జిడ్డును, క్రిములను వదిలించడం కోసం వేడి నీటిని ఉపయోగిస్తుంటాం. ఇంటిలోని అన్ని వస్తువులకు వేడి నీరు సరిపడదు. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేడి నీటితో కడగడం వల్ల అవి వాటి ఆకృతిని, రంగును కోల్పోవడమే కాకుండా పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఏ వస్తువులను చల్లని నీటితో, వేటిని వేడి నీటితో శుభ్రం చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం.

పట్టు, ఉన్ని దుస్తులు
పట్టు,ఉన్ని వంటి సున్నితమైన దుస్తులను ఎప్పుడూ వేడి నీటితో ఉతకకూడదు. వేడి నీటి వల్ల పట్టు వస్త్రాలు వాటి సహజమైన మెరుపును కోల్పోయి ముడుచుకుపోతాయి. అలాగే ఉన్ని దుస్తులు ష్రింక్ అయిపోయి గరుకుగా తయారవుతాయి. ఇటువంటి దుస్తులను ఎల్లప్పుడూ చల్లని నీరు లేదా గోరువెచ్చని నీటితో మాత్రమే ఉతకాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also read: Sweet After Meal: భోజనం తర్వాత స్వీటు తినాలనిపిస్తుందా? అయితే మీరు తినే తిండి మార్చాలి

చెక్క వస్తువులు, ఫర్నిచర్
ఇంటిలోని చెక్క సామాగ్రిని లేదా కిచెన్‌లోని కటింగ్ బోర్డులను శుభ్రం చేయడానికి వేడి నీటిని వాడటం పెద్ద పొరపాటు. వేడి వల్ల చెక్క ఉబ్బిపోవడమే కాకుండా, దానిపై ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది. దీనివల్ల కాలక్రమేణా చెక్కలో పగుళ్లు రావడం లేదా రంగు వెలిసిపోవడం జరుగుతుంది. వీటిని కేవలం తడి గుడ్డతో తుడిచి, ఆపై పొడి గుడ్డతో ఆరబెట్టడం మంచి పద్ధతి.

Advertisement

రక్తపు మరకలు,లెదర్ వస్తువులు
దుస్తులపై రక్తపు మరకలు పడినప్పుడు చాలామంది వేడి నీటిని ఉపయోగిస్తారు. కానీ వేడి నీరు రక్తంలోని ప్రొటీన్లను వస్త్రానికి మరింత గట్టిగా అంటుకునేలా చేస్తుంది. దీనివల్ల మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. వీటిని చల్లని నీటితో కడిగితేనే సులభంగా పోతాయి. అలాగే లెదర్ (Leather) సోఫాలు లేదా బ్యాగులను వేడి నీటితో తుడిస్తే, అవి పొడిబారిపోయి పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.

Also read: Acne Foods: రైస్ vs రోటి.. మొటిమలు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏది తింటే మంచిది?

పెయింట్ చేసిన గోడలు, మైక్రోఫైబర్ క్లాత్స్, కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను కూడా వేడి నీటికి దూరంగా ఉంచాలి. వేడి నీటి వల్ల పెయింట్ ఊడిపోవడం లేదా ప్లాస్టిక్ కరిగి విషతుల్యమైన రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఏదైనా వస్తువును శుభ్రం చేసే ముందు దానిపై ఉన్న ఇన్స్ట్రక్షన్ లేబుల్ చదవడం లేదా సాధారణ నీటిని వాడటం ఉత్తమం.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×