Epstein Files: ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్ ఫైల్స్ రేపిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడదే ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అరెస్టులు మొదలయ్యాయ్. బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో.. ఈ వ్యవహారంలో పడే నెక్ట్స్ వికెట్ ఎవరిదనే చర్చ మొదలైంది. డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ లాంటి వాళ్లపైనా.. కేసులు పెట్టే ఛాన్స్ ఉందా? జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో లింకులున్న వాళ్లంతా.. జైలుకెళ్తారా? నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనే చర్చ జోరుగా సాగుతోంది.
జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు వ్యవహారం కేవలం ఒకరిద్దరితో ఆగిపోయేలా కనిపించడం లేదు. దశాబ్దాలుగా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారి అసలు రంగు బయటపడుతుండటంతో.. ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేవలం ప్రిన్స్ ఆండ్రూ మాత్రమే కాదు, అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు, హాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉండటం హాట్ డిబేట్‌కు దారితీసింది. ఎప్‌స్టీన్‌తో వాళ్లకు ఉన్న పరిచయాలు, వారి మధ్య జరిగి సంభాషణలు, అతని హోస్ట్ చేసిన పార్టీలకు వెళ్లిన రికార్డులు, అతనితో దిగిన ఫోటోలు.. ఇలా అన్ని రికార్డులపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయ్. జెఫ్రీతో జరిపిన ఈ-మెయిల్స్, ఆడియో కాల్స్ హాట్ టాపిక్‌గా మారాయ్. ఆరోపణలు వచ్చిన వాళ్లు ఎన్ని రకాలుగా వివరణ ఇస్తున్నా.. చాలా మందిలో అనుమానాలు తొలగలేదు. ఎప్‌స్టీన్ దీవిలో జరిగిన అసాంఘిక కార్యకలాపాల్లో ఎవరి పాత్ర ఎంత? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. బలమైన సాక్ష్యాలు దొరికితే మాత్రం, ఎంతటి వారైనా కోర్టు మెట్లు ఎక్కక తప్పదు.
Also read; Donald Trump: ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్.. గుట్టు విప్పేస్తా, డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఎంతోమంది హై-ప్రొఫైల్ వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఇందులో.. బ్రిటీష్ బిజినెస్ మ్యాగ్నెట్ రిచర్డ్ బ్రాన్సన్ ఉన్నారు. 2013లో మహిళల పట్ల తనకున్న ఆసక్తిని ఎప్‌స్టీన్‌తో ఈ-మెయిల్‌లో పంచుకున్నారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పేరు కూడా సంచలనంగా మారింది. 2001 నుంచి 2004 వరకు ఎప్‌స్టీన్-క్లింటన్ అనేకసార్లు మాట్లాడుకున్నారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్‌కి కూడా ఎప్‌స్టీన్‌తో లింక్స్ ఉన్నాయ్. రష్యన్ అమ్మాయిల నుంచి బిల్‌గేట్స్‌కి లైంగిక సంక్రమణ వ్యాధి సోకిందనే విషయం సంచలనంగా మారింది. పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ పేరు కూడా ఇందులోఉంది. అతను.. ఎప్‌స్టీన్‌తో దిగిన ఫోటో ఒకటి బయటకొచ్చింది. అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్ పేరు కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉంది. అతనితో ఎన్నోసార్లు ఈమెయిల్స్, కాల్స్ మాట్లాడినట్లు తేలింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, బ్రిటీష్ దౌత్య వేత్త పీటర్ మండేల్సన్‌కి కూడా ఎప్‌స్టీన్‌తో లింకులున్నాయి. 2003, 2004లో 3 సార్లు విడివిడిగా 25 వేల డాలర్లు పంపారు. మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ లాంటి వారి పేర్లు ఉండటం కూడా ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. వీళ్లలో కొందరు చనిపోయారు. మరి.. బతికున్న వాళ్లపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్‌తో లింకులున్న.. బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తమ్ముడు, మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు దేశానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్‌ని అక్రమంగా చేరవేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై థేమ్స్‌వ్యాలీ పోలీసులు ఆండ్రూని అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎప్‌స్టీన్ వ్యవహారంలో.. ఆండ్రూ చాలాకాలంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎప్‌స్టీన్‌కు చెందిన దీవిలో బాలికలను ఆండ్రూ లైంగికంగా వేధించాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల.. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన 30 లక్షల ఎప్‌స్టీన్ ఫైల్స్ పత్రాల్లో.. ఆండ్రూకు చెందినవి కూడా ఉన్నాయి. బాలికలతో అభ్యంతరకంగా ఉన్న ఫొటోలు కూడా బయటకు రావటంతో ఆయన నేరాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బ్రిటన్ ప్రజల నుంచి డిమాండ్లు పెరిగాయి. దాంతో.. ఆండ్రూపై దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ కూడా తెలిపింది. అయితే.. లైంగిక వేధింపులపై కాకుండా.. అధికార దుర్వినియోగం ఆరోపణలపైనే ఆండ్రూని విచారించారు.
సుమారు 11 గంటల ఎంక్వైరీ తర్వాత పోలీసులు ఆండ్రూని విడిచిపెట్టారు. రిలీజ్డ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కింద పంపించేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తులో రుజువైతే.. బ్రిటన్ చట్టాల ప్రకారం జీవితఖైదు పడే అవకాశం ఉంది. ఆండ్రూ అరెస్ట్‌పై.. బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 స్పందించారు. ఈ విషయంలో.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు. వ్యక్తులకంటే వ్యవస్థే ఉన్నతమైనదని, అంతా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఆండ్రూ మౌంట్ బాటన్ 2001 నుంచి 2011 వరకు బ్రిటన్ వాణిజ్య రాయబారిగా పనిచేశారు. ఈ సమయంలో అతను అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయ్. 2010లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. వియత్నాం, సింగపూర్, హాంగ్‌కాంగ్ లాంటి దేశాల పర్యటనలకు సంబంధించిన.. అత్యంత రహస్య వాణిజ్య రిపోర్టులని.. ఎప్‌స్టీన్‌కు ఈ-మెయిల్ చేశారని ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బయటపడింది. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు.
ఇదే సమయంలో.. ఆండ్రూపై బ్రిటన్ మీడియాలో మరికొన్ని ఆరోపణలు వచ్చాయ్. ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న బాలికకు.. జెఫ్రీ ఎప్‌స్టీన్ కరెంట్ షాక్ ఇచ్చి హింసించాడని, ఆ సమయంలో.. ఆండ్రూ అక్కడే ఉన్నాడని కథనాలు వచ్చాయి. ఆ బాలికని టేబుల్‌పై బంధించి.. ఈ అరాచకానికి పాల్పడ్డారని ఓ గుర్తుతెలియని వ్యక్తి సమాచారమిచ్చారు. ఈ ఆరోపణలు ఎఫ్‌బీఐ పత్రాల్లో ఉన్నాయ్. అయితే, ఆండ్రూ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలని ఎప్పటికప్పుడు ఖండించారు. అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో లింకులు పెట్టుకోవడమే కాదు, తన కామవాంఛని తీర్చుకునేందుకు.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై.. పోలీసులు ఆండ్రూని గంటల పాటు విచారించడం.. బ్రిటన్‌లో కలకలం రేపింది. దాంతో.. ఎప్‌స్టీన్‌తో లింకులున్న మిగతా బిగ్ షాట్స్ పరిస్థితేమిటన్న చర్చ మొదలైంది. ఎందుకంటే.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహా బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్, రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, సెర్జీ లావ్రోవ్, బిల్ క్లింటన్ లాంటి బడా బాబుల పేర్లు, పోటోలు చాలానే ఉన్నాయ్. ఇప్పుడు వీళ్లంతా.. పోలీసులు కేసులను ఎదుర్కొంటారా? జైలుకెళ్తారా? అనే చర్చ మొదలైంది.
Story by: Anup, Big Tv
Also Read; Vishnu Vinyasam: విడుదలకు ముందే లాభాల దిశగా విష్ణు విన్యాసం.. బడ్జెట్ ఎంత? లాభం ఎన్ని కోట్లు?