E-Paper
Advertisement

CP Sajjanar: మందుబాబులకు మాస్ వార్నింగ్.. రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్: సీపీ సజ్జనార్

CP Sajjanar: మందుబాబులకు మాస్ వార్నింగ్.. రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్: సీపీ సజ్జనార్
Advertisement

CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యంగా, ప్రమాదాలను నివారించేందుకు డిసెంబర్ 24 (రేపు) నుంచి 30వ తేదీ వరకు నగరం వ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్’ (Special Enforcement Drive) నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ను ఏమాత్రం సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మోటార్ వాహనాల చట్టం–1988, సెక్షన్ 185 ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10,000 వరకు జరిమానాతో పాటు గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని సీపీ స్పష్టం చేశారు. ఒకవేళ నేరం పునరావృతమైతే డ్రైవింగ్ లైసెన్సును 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సస్పెండ్ చేస్తామని, తీవ్రమైన కేసుల్లో శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్యం మత్తులో ప్రమాదాలకు కారణమైతే భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

Advertisement

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని సీపీ గుర్తుచేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులు లేదా తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Read Also: December 2025 Cars Discounts: ఒడియమ్మ బంటీ.. కార్లపై ఆఫర్లే ఆఫర్లు, ఏకంగా రూ.10 లక్షల రాయితీ!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×