E-Paper
Advertisement

పోలీస్‌ వేలు కొరికి.. నడిరోడ్డుపై బట్టలిప్పేసి.. ర్యాపిడో డ్రైవర్ నానా హంగామా!

పోలీస్‌ వేలు కొరికి.. నడిరోడ్డుపై బట్టలిప్పేసి.. ర్యాపిడో డ్రైవర్ నానా హంగామా!
Advertisement

Rapido Rider: చాంద్రాయణగుట్ట చౌరస్తాలో శుక్రవారం రాత్రి జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. మద్యం మత్తులో ఓ ర్యాపిడో బైక్ రైడర్ చేసిన రచ్చ చూసి అక్కడ ఉన్న స్థానికులు, వాహనదారులు విస్తుపోయారు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపైనే దాడికి తెగబడటంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అసలేం జరిగింది?

Advertisement

ఎల్‌.బి.నగర్‌ వైపు వెళ్తున్న అజీజ్ అనే ర్యాపిడో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు చాంద్రాయణగుట్ట వద్ద ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేశారు. అందులో అతడు మద్యం సేవించినట్లు స్పష్టంగా రీడింగ్ వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవ్వగా, అజీజ్ ఒక్కసారిగా ప్రవర్తన మార్చుకొని గందరగోళం సృష్టించడం మొదలుపెట్టాడు.

పోలీసులపై దాడి.. రోడ్డుపై నగ్న ప్రదర్శన

Advertisement

తనను అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ను అజీజ్ కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా దాదాపు గంటన్నర పాటు రోడ్డుపైనే హంగామా చేశాడు. చివరకు ఒంటిపై ఉన్న దుస్తులు ఊడదీసి నగ్నంగా తిరుగుతూ బీభత్సం సృష్టించాడు.

కానిస్టేబుల్ వేలు కొరికి..

పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆ క్రమంలో కానిస్టేబుల్ నవీన్ చేతి వేలిని అజీజ్ దారుణంగా కొరికేశాడు. దెబ్బతిన్న కానిస్టేబుల్‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

కేసు నమోదు..

చివరకు అజీజ్‌ను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించిన అధికారులు, అతడి కుటుంబ సభ్యులను అక్కడికి పిలిపించి చట్టపరమైన నోటీసులు అందించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులపై దాడి, రచ్చ చేసినందుకు యువకుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు వేగవంతం చేశారు.

Also Read: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.. విజయవాడ కోర్టులో 102 పేజీల FIR!

Tags

Related News

పనిచేయనప్పుడు పదవులెందుకు.. బీజేపీ నేతలకు బన్సల్ వార్నింగ్?

తెలంగాణను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

బాసర ట్రిపుల్ ఐటీపై ఎల్‌నినో‌ ఎఫెక్ట్.. దసరా సెలవుల పొడిగింపు, ఆన్ లైన్ క్లాసులు కంటిన్యూ

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

ఆఫీస్‌లో నీచమైన పని.. బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియోలు తీసిన అటెండర్!

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. ఆ పరీక్షను వాయిదా వేయండి?

Big Stories

Advertisement
×