E-Paper
Advertisement

వావ్.. ఫ్రీగా కుల్ఫీ పార్టీ.. గోల్డెన్ అంకుల్ అదిరిపోయే ఆఫర్!

వావ్.. ఫ్రీగా కుల్ఫీ పార్టీ.. గోల్డెన్ అంకుల్ అదిరిపోయే ఆఫర్!
Advertisement

Golden Kulfi Uncle Promise: సాధారణంగా ఐపీఓలో షేర్లు అలాట్ అయితే పెట్టుబడిదారులు సంతోషంతో ఎగిరి గంతేస్తారు. కొందరు లాభాల కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు తమ పెట్టుబడికి మంచి రాబడి రావాలని కోరుకుంటారు. కానీ, ఓ కుల్ఫీ వ్యాపారి మాత్రం తనకు ఐపీఓ కేటాయింపు ఉచితంగా కుల్ఫీలు పంచుతానని ప్రకటించారు. దీంతో ఆయన చేసిన  ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నెట్టింట గోల్డెన్ అంకుల్ ఆఫర్ వైరల్

గోల్డెన్ కుల్ఫీ అంకుల్‌ గా గుర్తింపు పొందిన ఇండోర్ కు చెందిన వ్యాపారి బంటీ యాదవ్.. తన కుల్ఫీ స్టాల్ దగ్గర ఫ్రీ కుల్ఫీ ఆఫర్ గురించి కీలక ప్రకటన చేశారు. తనకు జియో ఐపీఓ కేటాయింపు వస్తే అందరికీ ఉచితంగా కుల్ఫీలు ఇస్తానని   చెప్పారు. ఆయన మాటలను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. సాధారణంగా ఐపీఓ కేటాయింపు కోసం చాలామంది ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి గోల్డెన్ అంకుల్‌కు కేటాయింపు వస్తుందా? లేదా? అనే ఆసక్తితో పాటు.. వస్తే ఉచితంగా కుల్ఫీలు ఎప్పుడు తినొచ్చా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

కుల్ఫీ కోసం ఉపవాసం..

Advertisement

ఇక ఈ ఘటనకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గోల్డెన్ అంకుల్‌కు ఐపీఓ కేటాయింపు వస్తే ఉచితంగా కుల్ఫీ తినొచ్చనే ఆశతో ఓ వ్యక్తి ఏకంగా ఉపవాసం ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు, తన ఉపవాసాన్ని అదే కుల్ఫీ స్టాల్ దగ్గరే విరమించాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి చాలా మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఐపీఓ కేటాయింపు కోసం ఇంతలా ఎదురుచూడటం ఎప్పుడూ చూడలేదని కొందరు అంటుంటే.. ఉచిత కుల్ఫీ కోసం ఇంతటి ఎదురుచూపులు మామూలు విషయం కాదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

చిన్న స్టాల్.. పెద్ద మనసు!

అటు గోల్డెన్ కుల్ఫీ అంకుల్ ఆఫర్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గోల్డెన్ అంకుల్ మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఓ కేటాయింపు వస్తే కుల్ఫీ పార్టీ ఇవ్వాలనే ఆయన ఆలోచన చుట్టూ ఉన్నవారిలో ఆనందాన్ని నింపుతోంది. చిన్న కుల్ఫీ స్టాల్  అయినప్పటికీ తన సంతోషాన్ని అందరితో పంచుకోవాలనే అతడి ఆలోచన అద్భుతం అంటున్నారు. అయితే, గోల్డెన్ అంకుల్‌కు నిజంగానే ఐపీఓ కేటాయింపు వస్తుందా? ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఉచితంగా కుల్ఫీలు పంచుతారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఐపీఓ కేటాయింపు ఒకరి పెట్టుబడికి సంతోషాన్ని ఇస్తే.. ఈసారి మాత్రం చాలామందికి కుల్ఫీ రూపంలో తీపి జ్ఞాపకాన్ని అందించనుంది.

Advertisement

Read Also: బీచ్‌లో పిల్లాడిని వదిలేసి.. తల్లిదండ్రుల రీల్స్, ఛీ కొంచెమైనా సిగ్గుందా?

Tags

Related News

బాబోయ్.. ఇది రైలా? హోటలా? ఇండియన్ రైల్వేపై ఫారిన్ కఫుల్ ప్రశంసలు!

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

హిమాలయాల్లో రైల్వే రూట్.. ఏకంగా 80 శాతానికి పైగా భూగర్భంలోనే!

ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు ఈజీగా రీఫండ్ అవుతాయి!

ఏపీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

6 రాష్ట్రాల మీదుగా 4,188 కి.మీ ప్రయాణం.. దేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇదే!

Big Stories

Advertisement
×