Man Attempt Suicide in Oyo: వారిద్దరు ప్రేమికులు.. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో దిగారు. అర్థరాత్రి నుంచి మొదలైన గొడవ.. తెల్లవారుజామున వరకు సాగింది. కోపానికి లోనై చివరకు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉంది.
హైదరాబాద్‌లోని రామంతపూర్‌లోని ఓయో హోటల్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. తన లవర్‌తో గొడవ పడిక కొద్దిసేపటికి ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే బాధితుడ్ని సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నమాట.
ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు బేగంబజారుకి చెందిన ఓంకార్. సౌమ్య అనే యువతిని ప్రేమించాడు. వారిద్దరు కలిసి రామంతపూర్ ప్రగతినగర్‌లోని ఓయో హోటల్‌లో దిగారు. రాత్రంతా బాగానే ఉన్నా, అర్థరాత్రి నుంచి వీరి మధ్య గొడవ మొదలైంది. తెల్లవారుజామున వరకు గొడవ జరిగింది.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. గొడవ కారణంగా ఓంకార్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. యువతి బాత్రూమ్‌కి వెళ్లిన వెంటనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే బయటకు వచ్చిన యువతి, ప్రియుడు ఫ్యాన్‌కు ఉరేసుకోవడాన్ని చూసి భయపడింది. వెంటనే ఓయూ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది.
ALSO READ: సీఎం రేవంత్ సీరియస్.. రైతులను ఇబ్బందిపెడితే ఎస్మా కింద చర్యలు
వెంటనే ఓంకార్‌ను కిందకు దించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓంకార్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ వారిద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది? ఘటనకు దారి తీసిన కారణాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఓంకార్ విషయం తెలియగానే కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరు నోరు విప్పితేగానీ అసలు విషయం బయటపడదని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ఓయో హోటల్ లో యువకుడు ఆత్మహత్యా యత్నం
రామాంతపూర్ ప్రగతి నగర్ లోని ఓయో హోటల్ లో రూమ్ తీసుకున్న సౌమ్య, ఓంకార్
తెల్లవారుజామున ప్రేమ జంట మధ్య గొడవ
ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఓంకార్
ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఓంకార్
ఓంకార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన… pic.twitter.com/HlT9ChNS8R
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2024