Shaktimaan: చిన్నపిల్లల కోసం ఒకప్పుడు రకరకాల సీరియల్స్, ప్రోగ్రామ్స్ వచ్చేవి. వాటికి పిల్లలు బాగా కనెక్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలాంటి షోలు, సీరియల్స్ రాలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకే పిల్లలు టీవీ చూడటం మానేసి ఫోన్లు చేత పట్టుకొని బానిసలుగా మారుతున్నారు. నిద్రలో కూడా ఫోన్ ను వదలడం లేదు. పిల్లల కోసం ప్రత్యేకమైన ప్రోగ్రాంలు వస్తే బాగుండు అని పేరెంట్స్ అనుకుంటున్నారు. అలాంటి వారికోసం అదిరిపోయే శుభవార్త.. ఒకప్పుడు పిల్లలు, పెద్దల ఆదరణ పొందిన టాప్ సీరియల్ శక్తిమాన్ అందరికి గుర్తే ఉంటుంది కదా.. ఇన్నాళ్లకు మళ్లీ ఆ సీరియల్ రాబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ శక్తిమాన్ సీరియల్ అప్పటిలో దూరదర్శన్ లో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయ్యింది. 1990-2000 సమయంలో పిల్లలకు ఒక ఎమోషన్. అదివారం వచ్చిందంటే చాలు టీవీల ముందు వాలిపోయేవాళ్లు పిల్లలు. సరిగ్గా 12 గంటలకు డీడీ నేషనల్‌లో ‘శక్తిమాన్ అనే సీరియల్ వచ్చేది. ఎంత ఆసక్తిగా ఉండేదో.. పిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఆసక్తిగా చూసేవారు. సీరియల్ కంప్లీట్ అయ్యేంత వరకు టీవీకి అతుక్కుపోయేవారు. ఆ తరువాత.. తామే శక్తిమాన్‌లా మారిపోయి సాహసాలు చేస్తుండేవారు. అంతగా పాపులర్ అయ్యింది ఈ డైలీ సీరియల్..
టెక్నీకల్ కారణాలతో పాటుగా మరికొన్ని కారణాలు ఛానెల్ కు రావడంతో ఈ సీరియల్ ఆగిపోయింది. మళ్లీ ఇప్పటివరకు ఆ సీరియల్ పేరు తియ్యలేదు. అప్పుడెప్పుడో ఈ శక్తీమాన్ హీరో ఓ విషయం పై కనిపించాడు. ఇప్పటికీ ఈ సీరియల్ మళ్లీ ప్రసారం కాబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు శక్తిమాన్ సీక్వెల్‌ను ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. యూట్యూబ్‌లో శక్తిమాన్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ షో గురించిన వివరాలు కూడా ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు. ఇక 66 ఏళ్ల వయసు ఉన్న ఈయన ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ వార్తలో నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రాబోతుందని సమాచారం.. ఇక భీష్మ ఇంటర్నేషనల్ యూట్యూబ్‌లో టీజర్ విడుదల చేశారు. ఆ వీడియోలో ‘భారతదేశపు మొదటి సూపర్ టీచర్, సూపర్ హీరో. అవును, ఈ రోజుల్లో పిల్లలను చీకటి ఆవహించింది. అందుకే ఆ చీకట్లను తొలగించడానికి ఇదే సరైన సమయం అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..