E-Paper
Advertisement

Multi Level Car Parking: కళ్లు జిగేల్ మనిపించే కార్ పార్కింగ్‌లు ఇప్పుడు మన హైదరాబాద్‌లో.. ఎక్కడో తెలుసా..?

Multi Level Car Parking: కళ్లు జిగేల్ మనిపించే కార్ పార్కింగ్‌లు ఇప్పుడు మన హైదరాబాద్‌లో.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Multi Level Car Parking: నగరంలో పార్కింగ్ సమస్య పరిష్కారానికి శాశ్వతంగా కాకపోయినా తాత్కాలిక పరిష్కారాన్ని చేకూర్చటంలో హైదరాబాద్ మెట్రో రైల్ వేసిన ప్రయత్నం సఫలం అయింది పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి డాక్టర్ ఎన్ వి ఎస్ రెడ్డి ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎండి మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ను ఆదివారంపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ ) విధానంలో ఈ ప్రాజెక్టుని రూ. 102 కోట్ల ప్రైవేట్ పెట్టుబడితో సుమారు 2 వేల చదరపు గజాల స్థలంలో దీన్ని నిర్మించినట్లు తెలిపారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశంలో ప్ర్పధమంగా జర్మన్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని అధికారులు తెలిపారు.

పార్కింగ్ జాగాలో 250 కార్లు

నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ కు సమీపంలో హెచ్ ఎంఆర్ కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మించినట్లు, 11వ అంతస్తులో సిటీ వ్యూ చేసేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్ర్కీన్ లతో కూడిన ఒక ఫిల్ము థియేటర్ ఉంటాయని అన్నారు. మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వందల చదరపు అడుగుల నిర్మిత ఏరియాలో 68 శాతం పార్కింగ్ కోసం, మిగిలిన 32 శాతం వాణిజ్య సదుపాయాలకు కేటాయించారు. పార్కింగ్ జాగాలో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పీపీపీ విధానంలో నోవమ్ అనే సంస్థ 50 సంవత్సరాల రాయితీ కాలంతో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. కోవిడ్ తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాలు తదితర కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని అధిగమించి ఎట్టేకేలకు కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. శనివారం హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఈ కాంప్లెక్స్ ను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

Advertisement

Also Read: Budget 2026-27: హైదరాబాద్‌కు హైస్పీడ్ వరం.. మూడు భారీ కారిడార్ల ప్రకటన!

ఆధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ టెక్నాలజీతో..

అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ టెక్నాలజీతో కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు “లోపలకు, బయటకు (ఇన్,అవుట్)” టెర్మినల్స్, వాహనాల నిలుపుదల కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్ పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలి, తమ నిర్దేశిత పనులకు హాజరుకావచ్చు. ఎంఎల్ పి లోనికి వాహనం ప్రవేశించిన సమయంలో వాహనదారులకి స్మార్ట్ కార్డు జారీ అవుతుంది. తరచూ ఎంఎల్ పి ని వినియోగించేవారికి “ఆర్ ఎఫ్ ఐడి” కార్డులు జారీచేస్తారు. వాహనదారులకి ఏ టెర్మినల్ కేటాయించినది ముందుగానే తెలియజేస్తారు. వాహనం కొలతలు ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరిన తర్వాత ట్రాన్స్ పోర్టర్ షటిల్ ఆ వాహనాన్ని లిఫ్ట్ ద్వారా నిర్ణీత అంతస్తులో కేటాయించిన స్థలంలో పార్క్ చేస్తుంది. ఈ మేరకు విశాలమైన, సౌకర్యవంతమైన టర్న్ టేబుల్సు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై, ఢిల్లీలో ఉన్న ఎంఎల్ పి పార్కింగ్ వ్యవస్థలలో వాహనదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆ పరిస్థితి దృష్టి లో పెట్టుకుని నాంపల్లి లో కొత్తగా ఏర్పాటు చేసిన కారు పార్కింగ్ కాంప్లెక్స్ లో ఆ ఇబ్బందల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

వాహనాన్ని పార్కింగ్ నుంచి బయటికి తీయడానికి..

Advertisement

పార్క్ చేసిన వాహనాన్ని తిరిగి బయటకు తీసేందుకు డ్రైవర్ పార్కింగ్ రుసుము చెల్లించి, పార్కింగ్ టిక్కెట్‌ను కార్డ్ రీడర్‌కు చూపగానే, ట్రాన్స్ పోర్టర్-షటిల్ ఆటోమేటిక్‌గా కారును వాహనదారునికి అందజేస్తుంది. అదే విధంగా, డ్రైవర్ కారుని రివర్స్ తిప్పుకోవల్సిన అవసరం లేకుండా అప్పగించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం, తిరిగి పొందడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అధునిక పార్కింగ్ కాంప్లెక్స్ మన నగర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా అభివర్ణించవచ్చునని వెల్లడించారు. దేశంలో నూతన పార్కింగ్ విప్లవానికి ఈ ప్రాజెక్టు నాంది కాగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Budget 2026-27: హైదరాబాద్‌కు హైస్పీడ్ వరం.. మూడు భారీ కారిడార్ల ప్రకటన!

Related News

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×