E-Paper
Advertisement

Funny Police Poster: మందుబాబులకు పోలీసుల ‘డీజే లాకప్’ ఆఫర్.. దొరికితే స్టేషన్‌లో పార్టీ!

Funny Police Poster: మందుబాబులకు పోలీసుల ‘డీజే లాకప్’ ఆఫర్.. దొరికితే స్టేషన్‌లో పార్టీ!
Advertisement

Funny Police Poster: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ పోలీసులు మందుబాబులకు తమదైన శైలిలో “కిక్” ఇచ్చే వార్నింగ్ ఇచ్చారు. తాగిన మత్తులో వాహనాలు నడిపే వారి కోసం “డీజే లాకప్” (#DJLockUp) పేరుతో ఒక సెటైరికల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“ఈ న్యూ ఇయర్ ఈవ్‌లో మాకు అతిథులుగా మారకండి” (Try not to be our guests) అంటూ పోలీసులు చమత్కరించారు. ఈ “డీజే లాకప్” పార్టీకి కేవలం రాష్ డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి మాత్రమే “ఫ్రీ ఎంట్రీ” ఉంటుందని పేర్కొన్నారు. ఇక మెనూ విషయానికొస్తే.. స్టేషన్‌లో “కాప్ కేక్” (Cop Cake) మరియు డెజర్ట్ కింద “కస్టడీ” (Custard-y) వడ్డిస్తామని సెటైర్ వేశారు. సమీపంలోని పోలీస్ స్టేషనే ఈ పార్టీ వెన్యూ అని స్పష్టం చేశారు.

Advertisement

ఈ హాస్యభరితమైన పోస్టర్ వెనుక సీరియస్ హెచ్చరిక కూడా ఉంది. ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై “జీరో టోలరెన్స్” (Zero Tolerance) విధానాన్ని ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా 120 కీలక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (BAC) 35 పాయింట్లు దాటితే.. అది కేవలం పరీక్షలో ఫెయిల్ అవ్వడం కాదని, జీవితం అనే పరీక్షలో ఫెయిల్ అవ్వడమేనని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా పార్టీల అనంతరం క్యాబ్ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ క్రియేటివ్ క్యాంపెయిన్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Advertisement

Read Also:New year 2026 Wishes: ఈ సరికొత్త కోట్స్‌తో మీ స్నేహితులు, ఆప్తులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేయండి

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×