Sahil Foods Raid: కటేదన్ సమీపంలోని ప్రేమావతిపేటలోని సాహిల్ ఫుడ్స్ యూనిట్లలో…. టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే ఉల్లంఘనలు బయటపడ్డాయి. యంత్రాలపై దుమ్ము, కన్వేయర్ బెల్టులపై ఆహార వ్యర్థాలు, అపరిశుభ్రమైన బకెట్లలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కనిపించాయి. సరైన వెంటిలేషన్ లేకపోవడం, సిబ్బంది గుట్కా, పాన్ మసాలా నములుతూ పనిచేయడాన్ని గుర్తించారు. దీంతో అధికారులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు.
55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్
ఏకంగా 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్ చేశారు. 33.94 లక్షల విలువైన స్టాక్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు యూనిట్ల లైసెన్సులు సస్పెండ్ చేశారు. మూడు నెలల షెల్ఫ్ లైఫ్‌కు సంబంధించిన అధ్యయన రికార్డులు, ఆహార పరీక్షలు, నీటి నాణ్యత నివేదికలు కూడా లేవని తేల్చారు. కొన్ని ఉత్పత్తులకు అవసరమైన కేటగిరీలు FSSAI లైసెన్సులోనూ లేవని గుర్తించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..
నిబంధనలకు విరుద్ధమైన లేబులింగ్‌తో ఉన్న 55 టన్నుల ఆహార పదార్థాలను సీజ్ చేసిన అధికారులు.. కల్తీ అనుమానంతో 11 నమూనాలను పరీక్షలకు పంపించారు. నాలుగు యూనిట్ల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేసి పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పుల వేళ.. సరిదిద్దుకోకపోతే దెబ్బే?