E-Paper
Advertisement

Holidays: జనవరిలో వరుస సెలవులు.. ప్రయాణాలకు ముందే ప్లాన్ చేసుకోండి.. హాలిడేస్ లిస్ట్ ఇదిగో..

Holidays: జనవరిలో వరుస సెలవులు.. ప్రయాణాలకు ముందే ప్లాన్ చేసుకోండి.. హాలిడేస్ లిస్ట్ ఇదిగో..
Advertisement

2025 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. సరికొత్త ఆశలతో 2026లోకి అడుగుపెట్టేందుకు యావత్ దేశం సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అప్పుడే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే జనవరి నెలలో వచ్చే వరుస సెలవుల జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు కూడా ఈ నెలలో గణనీయమైన సంఖ్యలో సెలవులు రానున్నాయి.

Advertisement

కొత్త ఏడాది ఆరంభం ఇలా..

జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించనున్నాయి. ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకోవడానికి ఇది చక్కని అవకాశం. ఇక జనవరి 2న మన్నం జయంతి, జనవరి 3న హజ్రత్ అలీ జన్మదినం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో లేదా ప్రాంతాల్లో స్థానిక సెలవులు ఉండనున్నాయి. దీనివల్ల నెల ఆరంభంలోనే వరుసగా మూడు నాలుగు రోజులు విరామం లభించే అవకాశం ఉంది.

Advertisement

పండగల సందడి.. సంక్రాంతి హడావిడి..

జనవరి నెల అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సంక్రాంతి సంబరాలు. జనవరి 14న మకర సంక్రాంతి, 15న పొంగల్/ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఇచ్చే ప్రాధాన్యత దృష్ట్యా పాఠశాలలకు, కళాశాలలకు సుదీర్ఘ సెలవులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జనవరి 16న తిరువళ్ళువర్ దినోత్సవం, 17న ఉలవర్ తిరునాళ్ (రైతు దినోత్సవం) సందర్భంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రత్యేక సెలవులు ఉంటాయి.

జాతీయ పర్వదినాలు, మహనీయుల జయంతిలు..

జనవరి 12న స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) జరగనుంది. ఇక జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతితో పాటు వసంత పంచమి కూడా రావడం విశేషం. నెల ఆఖరులో జనవరి 26న దేశమంతటా ఘనంగా జరుపుకునే ‘గణతంత్ర దినోత్సవం’ (రిపబ్లిక్ డే) జాతీయ సెలవు దినంగా ఉంటుంది. సోమవారం రిపబ్లిక్ డే రావడం వల్ల ఉద్యోగులకు శని, ఆదివారాలతో కలిపి లాంగ్ వీకెండ్ లభించనుంది. దీంతో వరుసగా మూడు రోజులు సెలువులు రానున్నాయి.

వారాంతపు సెలవులు..

పండుగ సెలవులే కాకుండా.. జనవరి నెలలో వచ్చే ఆదివారాలు, రెండో శనివారం..ఈ సెలవులన్నీ కలిపి చూస్తే.. జనవరి నెలలో దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు వివిధ రూపాల్లో విరామం లభించే అవకాశం ఉంది. పర్యాటక ప్రియులు, తమ స్వగ్రామాలకు వెళ్లేవారు ఈ సెలవుల జాబితాను బట్టి ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ముఖ్య గమనిక..

అయితే, ఈ సెలవుల ప్రకటన అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, సంస్థల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న జాబితాలో కొన్ని సెలవులు ప్రాంతీయ ప్రాతిపదికన మాత్రమే అమలవుతాయి. కావున, ఖచ్చితమైన సమాచారం కోసం ఆయా ప్రభుత్వ ఉత్తర్వులను లేదా మీ కార్యాలయ నిబంధనలను పరిశీలించాల్సి  ఉంటుంది.

ALSO READ: Bank Holidays: జనవరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు.. లిస్ట్ పెద్దదే.. ముందే ప్లాన్ చేసుకోండి..

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×