E-Paper
Advertisement

Bank Holidays: జనవరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు.. లిస్ట్ పెద్దదే.. ముందే ప్లాన్ చేసుకోండి..

Bank Holidays: జనవరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు.. లిస్ట్ పెద్దదే.. ముందే ప్లాన్ చేసుకోండి..
Advertisement

కొత్త ఏడాది 2026 అడుగుపెడుతున్న తరుణంలో..  సామాన్య ప్రజలకు తమ ఆర్థిక కార్యకలాపాలపై అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లే పనులు ఉన్నవారు జనవరి నెలలో వచ్చే సెలవుల జాబితాను ముందుగానే చెక్ చేసుకోవాలి. జనవరి నెల పండుగలు, నేషనల్ హాలీ డేస్,  ప్రాంతీయ పండుగులతో అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు రానున్నాయి.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. ప్రతి నెలలో రెండో, నాలుగవ శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటికి అదనంగా ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే ప్రాంతీయ పండుగలు కలగలిపి జనవరిలో సెలవుల జాబితా కాస్త పెద్దదిగానే ఉంది. ఆయా రాష్ట్రాన్ని బట్టి  బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Advertisement

వరుస సెలవుల వివరాలు.. 

జనవరి 1న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత జనవరి 6న సిక్కుల పదవ గురువు గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జనవరి 11 ఆదివారం కావడంతో మిజోరంలో మిషనరీ డే వేడుకలు జరగనున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్‌లో జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

Advertisement

దక్షిణ భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి, పొంగల్ పండుగల సందడి జనవరి 13 నుంచి 15 వరకు ఉంటుంది. లోహ్రి, సంక్రాంతి, పొంగల్, భోగి వంటి వేడుకల వల్ల తమిళనాడు, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి  సందర్బంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండగా.. వెనువెంటనే జనవరి 24 నాలుగో శనివారం వస్తుంది.

రిపబ్లిక్ డే.. నేషనల్ హాలిడే..

జనవరి నెలలో అత్యంత ముఖ్యమైన సెలవు గణతంత్ర దినోత్సవం. 2026 జనవరి 26 సోమవారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూసి ఉంటాయి. శని, ఆదివారాలతో కలిపి మూడు రోజుల సుదీర్ఘ వీకెండ్ రావడంతో ప్రజలు పర్యటనలకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.

పర్యాటక ప్రేమికులకు ఇదే కరెక్ట్ టైం.. 

జనవరి నెలలో వచ్చే ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని విహారయాత్రలకు వెళ్లేవారు ఉత్తరాఖండ్‌లోని ఔలీ, రాజస్థాన్‌లోని జైపూర్ లేదా ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌ను సందర్శించవచ్చు. గుజరాత్‌లోని కచ్‌ రన్ ఉత్సవ్ కూడా ఈ సమయంలో పర్యాటకులను ఎంతో గానూ ఆకర్షిస్తోంది.

ముందస్తు జాగ్రత్తలు.. 

బ్యాంకు సెలవుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏటీఎంలు అందుబాటులో ఉన్నప్పటికీ.. పెద్ద మొత్తంలో లావాదేవీలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు ఉన్నవారు ఈ సెలవుల వివరాలను గమనించి ముందే సిద్ధమవ్వడం బెటర్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉంటాయి.

 ALSO READ: Sammakka Sarakka Jatara 2026: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు.. అద్భుత శక్తి రూపాలు, సమ్మక్క సారలమ్మలు

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×