E-Paper
Advertisement

FSL Fire Accident: ఫోరెన్సిక్​ ల్యాబ్ ప్రమాదంపై విచారణ షురూ.. వెలుగులోకి కీలక విషయాలు..?

FSL Fire Accident: ఫోరెన్సిక్​ ల్యాబ్ ప్రమాదంపై విచారణ షురూ.. వెలుగులోకి కీలక విషయాలు..?
Advertisement

FSL Fire Accident: స్వేఛ్చ బ్యూరో: రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​) అగ్నిప్రమాదంపై దర్యాప్తు మొదలయ్యింది. సెంట్రల్​ ఫోరెన్సిక్​ లేబోరేటరీ నుంచి వచ్చిన నిపుణులు డేటా రిట్రైవ్​ చేసే ప్రయత్నాలు ప్రారంభించగా నాగ్ పూర్​ నుంచి వచ్చిన నేషనల్​ ఫైర్​ సర్వీసెస్​ కాలేజీ నుంచి వచ్చిన ఛీఫ్​ ఇన్వెస్టిగేటర అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది నిర్ధారించటానికి విచారణ చేస్తున్నారు. జరిగింది ప్రమాదమా?.. మరేదైనా కారణం ఉందా? అన్నది నిగ్గు తేల్చే పని ప్రారంభించారు. నాంపల్లి రెడ్​ హిల్స్​‌లో ఉన్న ఎఫ్​ఎస్​ఎల్(FSL) లో ఈనెల 7న ఉదయం 10గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

ఫోన్​ ట్యాపింగ్ కేసుకు..

భవనం మొదటి అంతస్తులో చెలరేగిన అగ్నికీలల్లో కంప్యూటర్​ ల్యాబ్ పాటు సర్వర్​ రూంలో ఉన్న పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి. దుర్ఘటనలో ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​, ఓటుకు నోటుతోపాటు మరికొన్ని కేసుల్లోని కీలక సాక్ష్యాధారాలు కాలిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నింటినీ ఇప్పటికే కోర్టుకు సమర్పించామని, ఫోన్​ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన మెటీరియల్ ఆబ్జక్టుల్లో సింహభాగం వాటిని విశ్లేషించి రిపోర్టులను సంబంధిత దర్యాప్తు అధికారులకు పంపించామని డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy)తోపాటు ఎఫ్​ఎస్​ఎల్ డైరెక్టర్ శిఖా గోయెల్(Shikha Goel) స్పష్టంగా చెప్పారు. అయినా, బీఆర్​ఎస్​ తోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు జరిగిన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు గుప్పించారు.

Advertisement

Also Read: Viral Video: ఓ యువకుడు కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి పెళ్లి చేశారు, బీహార్‌లో దారుణం

డేటా రికవరీతోపాటు..

ఈ క్రమంలోనే అగ్నిప్రమాదంలో నష్టపోయిన డేటాను రిట్రైవ్​ చేయటంతోపాటు అసలు మంటలు ఎలా ఎగిసి పడ్డాయన్న దానిని నిర్ధారించటానికి పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డేటాను రిట్రైవ్ చేయటానికి సెంట్రల్ ఫోరెన్సిక్ లేబోరేటరీ నుంచి ఎక్స్​ పర్ట్ ను పిలిపించారు. ప్రస్తుతం ఆయన మన ఎఫ్ఎస్​ఎల్ సిబ్బందితో కలిసి తన వెంట తెచ్చుకున్న టూల్స్​ సహాయంతో పని కూడా మొదలు పెట్టారు. ఇక, నాగ్ పూర్​ లోని నేషనల్ ఫైర్ సర్వీసెస్​ కాలేజీ నుంచి వచ్చిన ఛీఫ్​ ఇన్వెస్టిగేటర్ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో బుధవారం ఎఫ్​ఎస్​ఎల్ లోని వైరింగ్​ ను ఆయన క్షుణ్నంగా తనిఖీ చేసినట్టు సమాచారం. దాంతోపాటు ప్రమాదం సంభవించినపుడు అక్కడే ఉన్న ఎఫ్​ఎస్​ఎల్ ఉద్యోగులతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో వైరింగ్ పాతదైపోవటం వల్ల షార్ట్​ సర్క్యూట్ జరిగి మంటల ఎగిసి పడినట్టుగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. దీనిపై పోలీసు అధికారులతో మాట్లాడగా విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Advertisement

Also Read: Galaxy Unpacked 2026: గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ మరికొన్ని రోజుల్లోనే.. ప్రీ బుకింగ్ షురూ

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×