E-Paper
Advertisement

Oats Benefits: ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా? చాలామందికి తెలియని అసలు నిజం ఇదే!

Oats Benefits: ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా? చాలామందికి తెలియని అసలు నిజం ఇదే!
Advertisement

Oats Benefits: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనే. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే తప్ప హెల్త్‌ని బ్యాలన్స్ చేసుకోలేము. ఈ క్రమంలో తృణధాన్యాల జాబితాలో ఓట్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా శరీరంలోని ప్రతి అవయవానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. వీటిలో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్, ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. ఓట్స్‌ కేవలం అల్పాహారంగానే కాకుండా.. ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతంలా సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం పదిలం..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఓట్స్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎనిమిది వారాల పాటు నిరంతరంగా ఓట్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు క్రమబద్ధీకరించబడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెపై ఒత్తిడి తగ్గించి, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూడటంలో ఓట్స్‌ను మించిన పోషకాహారం మరొకటి లేదు.

Advertisement

Also Read: మోకాళ్ల నొప్పులకు క్యాబేజీ ఆకులు చుడితే తగ్గుతాయా? డాక్టర్లు చెబుతున్న అసలు నిజాలివే!

మధుమేహ నియంత్రణ..

మధుమేహం సమస్య ఉన్నవారికి ఓట్స్ ఓ వరమని చెప్పవచ్చు. వీటిని తిన్నప్పుడు శరీరంలో కార్బోహైడ్రేట్లు చాలా నెమ్మదిగా విడుదలవుతాయి. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ఆస్కారం ఉండదు. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బాధితులు తమ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మెరుగైన జీర్ణశక్తి..

Advertisement

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఓట్స్ బెస్ట్ ఆప్షన్. వీటిలోని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి, మలబద్ధకం వంటి ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే, ఓట్స్ తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఫలితంగా అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఉండొచ్చు. ఇది పరోక్షంగా బరువు తగ్గడానికి, శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను అందించడానికి సహకరిస్తుంది.

Also Read: మైదా లేకుండా హెల్దీ పన్నీర్ రోల్స్.. ఈ సీక్రెట్ మసాలాలతో చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు!

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×