E-Paper
Advertisement

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. టెక్ దిగ్గజాల ప్రశంసలు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. టెక్ దిగ్గజాల ప్రశంసలు
Advertisement

Revanth Reddy: అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (USISPF) వార్షిక సదస్సులో.. తెలంగాణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ఆయన స్పష్టంగా వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఇప్పుడు భారత్‌లో పెట్టుబడుల ముఖద్వారంగా మారింది. అధునాతన మౌలిక వసతులు, వ్యూహాత్మక స్థానం, భద్రత, ఆధునిక సాంకేతిక వాతావరణం కారణంగా.. పెట్టుబడిదారులకు ఇది ఉత్తమ గమ్యం అని అన్నారు. రాష్ట్రంలో పారదర్శక, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణంను సృష్టించామని ఆయన తెలిపారు.

Advertisement

రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, డ్రై పోర్ట్, రేడియల్ రోడ్లు వంటి ప్రాజెక్టులు తెలంగాణలో మౌలిక వసతుల విప్లవాన్ని తెస్తాయని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రారంభమవుతోందని వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘చైనా +1 మోడల్’ కు తెలంగాణే ప్రత్యామ్నాయం అవుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ సరఫరా శృంఖల పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

Advertisement

మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి తెలంగాణ అభివృద్ధికి ప్రధాన స్థంబాలని పేర్కొంటూ, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను హైదరాబాద్‌లో క్యాంపస్‌లు ప్రారంభించమని ఆహ్వానించారు.

గ్లోబల్ సౌత్ దేశాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో, సులభ వీసా విధానాలతో నాణ్యమైన విద్య అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లకు ఇకపై నేతల పేర్లు కాకుండా గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల పేర్లు పెట్టాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. హైదరాబాద్‌ ఆధునికత, ఆవిష్కరణలకు ప్రతీకగా నిలవాలి అని అన్నారు.

మూసీ నది పునరుజ్జీవనం ద్వారా హైదరాబాద్‌లో పర్యావరణ సమతుల్యతను, పర్యాటకాన్ని, నైట్ ఎకానమీని అభివృద్ధి చేస్తాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరం 24 గంటల ఆర్థిక చైతన్యంతో ముందుకు సాగుతుంది అని చెప్పారు.

సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పునరుత్పాదక శక్తి, డిజిటల్ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలతో.. తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రణాళికను వివరించారు.

USISPF అధ్యక్షుడు డా. ముఖేష్ ఆఘి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి విజన్ బోల్డ్, పారదర్శకమైనది, సాధ్యమైనది. ఆయన ప్రణాళికలు సామాజికంగా, ఆర్థికంగా ప్రేరణాత్మక ప్రభావం చూపుతాయి అని అభిప్రాయపడ్డారు.

Also Read: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. రేపు ఈ ప్రాంతాల్లో సెలవు ఉంటుందా..?

డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు హాజరవుతామని ఆయన ప్రకటించారు. తెలంగాణ విజన్‌ను మరింత దగ్గరగా తెలుసుకోవడానికి మేము ఆసక్తిగా ఉన్నాం అని తెలిపారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×