E-Paper
Advertisement

Eggs vs Paneer: ఈ రెండిట్లో బ్రేక్‌ఫాస్ట్‌‌కి ఏది బెస్ట్?.. దీని వెనుకున్న అసలు విషయం ఇదే!

Eggs vs Paneer: ఈ రెండిట్లో బ్రేక్‌ఫాస్ట్‌‌కి ఏది బెస్ట్?.. దీని వెనుకున్న అసలు విషయం ఇదే!
Advertisement

Eggs vs Paneer: సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రొటీన్ ఫుడ్స్ తీసుకుంటుంటారు. అయితే, వీరిలో ఉండే కామన్ డౌట్ ఏమిటంటే.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్ కంటెంట్‌గా ఎగ్స్ తీసుకోవాలా? లేదా పనీర్ తీసుకోవాలా? అనే కదా. జిమ్‌కు వెళ్లే కొందరు ఎగ్స్ తింటుంటే.. నాన్‌వెజ్ తినని మరికొందరు పన్నీర్ తీసుకుంటున్నారు. అయితే ఆ రెండిటిలో దేనిలో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది? ఉదయం అల్పాహారంలో ఏది తినడం బెస్ట్.. అని చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం రండి..

మంచి టేస్టీతో కూడిన అల్పాహారం తీసుకోవలంటే.. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, తక్షణ శక్తితో పాటు మంచి పోషకాలు, ముఖ్యంగా ఎక్కువ ప్రొటీన్‌ కావాలంటే గుడ్లు, పనీర్ బెస్ట్ ఆప్షన్స్. ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే.. ఈ రెండు ఆహారాలు పోషకమైనవిగా ఉండటంతో పాటు కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తాయి. అంతేకాదు ఎగ్స్, పన్నీర్ రెండూ.. బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్..టి చాలామంది వీటిని తినడానికి ఇష్టపడతారు.

బాయిల్డ్ ఎగ్స్.. స్వచ్ఛమైన ప్రొటీన్:

Advertisement

సాధారణంగా కోడిగుడ్లను పూర్తి ప్రోటీన్ ఆహారంగా చెబుతుంటారు. అంటే.. ఇందులో మన కండరాలు పెరగడానికి కావాల్సిన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. రోజూ రెండు గుడ్లు తింటే.. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జీవక్రియ, శక్తిస్థాయిలు మెరుగవుతాయి. ఎగ్స్‌లోని కొవ్వులు కంటికి మేలు చేస్తాయి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ దొరుకుతుంది. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొన తక్కువ కేలరీలతో స్వచ్ఛమైన ప్రొటీన్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి.. గుడ్లను ఉడికించి తీసుకోవచ్చు.

అలాంటి వారికి పనీన్ బెస్ట్:

పనీర్.. అనేది అత్యుత్తమ నాణ్యత కలిగిన ఫ్రొటీన్ యొక్క పవర్‌హౌస్. ఇది కండరాల పెరుగుదలకు, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు.. పనీర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందుకే తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వేయదు. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. పనీర్‌ను పాలతో తయారు చేస్తారు కాబట్టి.. దీనిలో కాల్షియం, పాస్పరస్ అధికం. ఇవి మన ఎముకలు, దంతాలను గట్టిగా ఉంచుతాయి. పనీర్ ఆరోగ్యకమరైన కొవ్వులను కలిగి ఉండటంతో.. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా స్థిరమైన శక్తిని అందిస్తుంది. కాబట్టి.. షుగర్ ఉన్నవాళ్లు బ్రేక్‌ఫాస్ట్‌లో పనీర్‌నే చేర్చుకోవచ్చు.

గుడ్లు వర్సెస్ పనీర్.. ఏది బెస్ట్?

Advertisement

గుడ్లు-పనీర్ రెండూ.. దాదాపు ఒకే రకమైన ప్రొటీన్‌ కంటెంట్‌ను ఇస్తాయి. కాబట్..టి ఒకదాని కంటే మరొకటి గొప్పదని చెప్పలేం. అయితే, ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం.. అల్పాహారంలో అభిరుచి, పోషకాల వైవిధ్యాన్ని కొనసాగించడానికి.. ఒకరోజు ఉడికించిన గుడ్లు.. మరుసటి రోజు ఓ కప్పు పనీర్ తీసుకోవచ్చు. ఈ రెండిటి వల్ల సమానమైన ప్రయోజనాన్ని పొందవచ్చు.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×