E-Paper
Advertisement

Bhupalpalli: గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. స్టూడెంట్‌ను చితకబాదిన వార్డెన్, భూపాలపల్లి జిల్లాలో ఘటన

Bhupalpalli: గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. స్టూడెంట్‌ను చితకబాదిన వార్డెన్, భూపాలపల్లి జిల్లాలో ఘటన
Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మరోసారి వివాదాలకు నిలయమైంది. విద్యాబుద్ధులు నేర్పించి.. అండగా నిలవాల్సిన వార్డెన్ కంచే చేను మేసిన చందంగా ఒక విద్యార్థినిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని కర్రతో, చేతులతో ఇష్టారీతిన చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే..?

Advertisement

గత నెల 24వ తేదీన హాస్టల్‌లో స్వల్ప కారణంతో వార్డెన్ భవానికి, సదరు విద్యార్థినికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వార్డెన్, విద్యార్థిని అని కూడా చూడకుండా కర్ర తీసుకుని దాడికి దిగారు. తోటి విద్యార్థినులు అడ్డుకుంటున్నా వినకుండా.. బూతులు తిడుతూ కనికరం లేకుండా కొట్టారు. ఈ దారుణాన్ని గమనించిన తోటి విద్యార్థినులు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే.. వార్డెన్ భయంతో ఈ విషయం బయటకు రాకుండా దాదాపు నెల రోజులుగా గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా హాస్టల్

Advertisement

ఈ హాస్టల్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం ఇదే హాస్టల్‌లో విద్యార్థినులకు కొన్ని వర్గాల మత బోధనలు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఈ వార్త రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరువక ముందే, ఇప్పుడు ఏకంగా విద్యార్థినిపై శారీరక దాడి జరగడం హాస్టల్ నిర్వహణపై అనేక అనుమానాలకు తావిస్తోంది. వరుసగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే, ఇక్కడ మత బోధనలు, భౌతిక దాడులు జరుగుతున్నాయి. మా పిల్లల భద్రతకు గ్యారెంటీ ఏది?’ అని వారు ప్రశ్నిస్తున్నారు.

నిరసన సెగ.. వార్డెన్‌పై చర్యలకు డిమాండ్

విద్యార్థినిపై దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఇతర దళిత సంఘాలు హాస్టల్ ముందు భారీ నిరసన చేపట్టాయి. వార్డెన్ భవానిని వెంటనే విధుల నుంచి తొలగించడమే కాకుండా, ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జిల్లాలోని హాస్టళ్లలో ఉన్న పరిస్థితులను సమీక్షించాలని కోరుతున్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ALSO READ: KTR comments: అసెంబ్లీలో కేసీఆర్‌‌కు రేవంత్ షేక్ హ్యాండ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

 

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×