BigTV English

Kavitha – KTR : ఆ విషయంలో కవితే బెస్ట్.. కేటీఆర్ లాస్ట్?

Kavitha – KTR : ఆ విషయంలో కవితే బెస్ట్.. కేటీఆర్ లాస్ట్?

Kavitha – KTR : సీఎం రేవంత్‌కు అవినీతి చక్రవర్తి అనే బిరుదు..
ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటం?
సోనియాగాంధీపై పోస్ట్ కార్డుల ఉద్యమం..
చంద్రబాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్‌గా ఇచ్చిన రేవంత్
మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ ఏది?
18 నెలల్లో రూ.2లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ సర్కార్


ఇవీ ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన హాట్ కామెంట్స్. అన్నీ పదునైన విమర్శలే. అందుకే కాంగ్రెస్ నేతల నుంచి సైతం స్ట్రాంగ్ కౌంటర్లు పడుతున్నాయి. ఇన్నాళ్లూ పోనీలే అని కవితక్క మాటలను లైట్ తీసుకున్నారు. ఏదో ఉనికి కోసం ప్రయత్నం అనుకున్నారు. కానీ, మాటల తీవ్రత పెరుగుతుండటంతో హస్తం పార్టీ అలర్ట్ అయింది. డైలాగ్‌కు డైలాగ్‌తో బదులిస్తోంది. ఇదే కదా కవితకు కావలసింది. అందుకేగా ఇంతలా విమర్శలతో రెచ్చిపోతోంది. తాను అనుకున్న టార్గెట్‌ రీచ్ అయినట్టే అనిపిస్తోంది. కవితపై కాంగ్రెస్ ఫైర్ అవుతుండటంతో ఆమె పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతోంది. మరి, కేటీఆర్ సంగతేంది?

కేటీఆర్ గ్రాఫ్ డౌన్?


ఇటీవల కేటీఆర్ చేసిన విమర్శలు గుర్తు చేసుకుంటే.. అందులో కొత్తగా, గొప్పగా ఏం లేవు అంటున్నారు. ఎప్పుడూ చేసే రొటీన్ డైలాగ్సే. తాను తప్పేం చేయలేదని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని.. అన్నీ ఇలాంటివే. అందుకే, కేటీఆర్ గ్రాఫ్ రోజురోజుకూ డౌన్ ఫాల్ అవుతోందని అంటున్నారు. ఆయన మెడకు చుట్టుకున్న ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి.. చుట్టుకోబోయే ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు నుంచి.. బయటపడాలనే తాపత్రయమే కానీ.. ప్రజా పోరాటాలు చేసింది లేదని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కవిత మాత్రం అన్నలా కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారామె. జాగృతి జెండా కింద సరికొత్త రాజకీయం చేస్తున్నారు. కొత్త కొత్త ఉద్యమాలు చేస్తున్నారు. మహిళలతో సోనియాకు పోస్టు కార్డులు రాయించాలనే ఐడియా.. ధర్నాలు, వీధిపోరాటాలతో బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ప్రజల నుంచే అంతగా స్పందన రాకపోవడమే పెద్ద మైనస్ అని చెబుతున్నారు.

ఆ పదవి నుంచి తీసేయాలా?

కేటీఆర్‌తో పోలిస్తే కవితనే చాలా చురుగ్గా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంటూ కేటీఆర్ మీద ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఆయన్ను ఆ పదవి నుంచి పీకేసి.. కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే చర్చ కూడా స్టార్ట్ అయింది. గతంలో ఉద్యమ సమయంలో ఎలాగైతే తండ్రి చాటు బిడ్డగా యాక్టివ్‌ పాలిటిక్స్ చేశారో.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ పాత కవిత కొత్తగా కనిపిస్తున్నారని అంటున్నారు. అయితే, గతంలో మాదిరి ఆమెకు ఇప్పుడు తండ్రి సపోర్ట్ లేదు. అన్నతో గొడవలు. బావ పట్టించుకోవట్లేదు. గులాబీ దండు అండ కూడా లేదు. అయితేనేం.. నేను సింగిల్ అంటూ ఒంటరి పోరాటం గట్టిగా చేస్తున్నారు. ఏ ప్రయోజనాలను ఆశించో..?

Also Read : ఆంధ్రోళ్ల బిర్యానీ.. కవితక్క అగ్గి రాజేస్తున్నారా?

ఫ్యూచర్ డౌటేనా?

కవిత అంతలా ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే.. కేటీఆర్ మాత్రం ఇప్పటికీ వైట్ కాలర్ పాలిటిక్స్‌కే పరిమితం అయ్యారని గులాబీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. కేటీఆర్‌లో మాస్ పల్స్ లేదని.. కవిత ఉన్నంత యాక్టివ్‌గా కూడా లేరని.. ఇలాగైతే కారును గంప గుత్తగా అమ్మేసుకోవాల్సిందేననే చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు రాకపోవడం, కేటీఆర్ ఇలా అవడం చూస్తుంటే.. బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ డౌటే అంటున్నారు. కవితకు పార్టీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాన్ని ముందే ఊహించిన కేటీఆర్.. అందుకే చెల్లిని సైడ్ చేశారని చెబుతున్నారు. తొక్కేస్తే తగ్గేదేలే అంటూ కవిత సైతం అంతే గట్టిగా పోరాడుతున్నారు. కొత్త పార్టీ, బీజేపీలో విలీనం అంటూ ప్రచారం జరుగుతున్నా.. అలాంటిదేమీ లేదంటూ కవిత చెబుతున్నా.. అనుమానం మాత్రం అలానే ఉంది. కేటీఆర్‌తో పోలిస్తే కవిత గ్రాఫ్ మెరుగుపడుతోంది.

Related News

Bathukamma Festival: సరూర్‌నగర్ స్టేడియంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ఒకేసారి 1500 మంది మహిళలతో గిన్నిస్ రికార్డ్..!

VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా చివరి రోజు.. సిటీ బస్సులో ప్రయాణించిన వీసీ సజ్జనార్

Ponnam Prabhakar: అయ్యా దయచేసి ఆ పిటిషన్ వెనక్కి తీసుకోండి.. రిజర్వేషన్ల పై పొన్నం రిక్వెస్ట్

CM Revanth Reddy: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

TG Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ రిలీజ్, అక్టోబర్ నుంచి మొదలు

Hyderabad News: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్-భోజనం

Delhi News: ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. సీఎం రేఖాగుప్తా, ఉపాసన హాజరు

Weather Update: హై అలర్ట్..! నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్..

Big Stories

×