Vijay Devarakonda: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లో ఉన్న టాప్ హీరోస్ లో విజయ్ దేవరకొండ ఒకరు. ముందుగా చిన్న చిన్న చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన విజయ్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమా విజయ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన సాలిడ్ హిట్ సినిమా పడకపోయినా కూడా విజయ్ కు ఆ క్రేజీ ఉంది అంటే కారణం అర్జున్ రెడ్డి. ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి విజయ్ సిద్ధమవుతున్నాడు. విజయ్ రీసెంట్ గా ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అనే కార్యక్రమానికి హాజరై యూత్ తో కొన్ని విషయాలు పంచుకున్నారు.
జీవితంలో డబ్బులు చాలా ముఖ్యం
జీవితంలో డబ్బులు చాలా ముఖ్యం. డబ్బులుంటే జీవితం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నేను డబ్బులు లేని జీవితం చూసిన డబ్బులు ఉన్న జీవితం చూసా. సక్సెస్ మరియు మనీ ఆల్వేస్ కంఫర్ట్ ఇస్తుంది. 30 సంవత్సరాల వరకు నేనెవరో నాకే తెలియదు. అప్పటివరకు పక్కనున్న ఫ్రెండ్స్ వలన రకరకాల సిట్యుయేషన్స్ వలన బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు ఏజ్ లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇండియాలో యంగ్ పాపులేషన్ బాగా ఉంది. మన స్టేట్ పవర్ మన కంట్రీ పవర్ కేవలం యూత్. ఒక కంట్రీ ని నాశనం చేయాలంటే వార్ చేయాలి, యూత్ ను పాడుచేసిన కూడా కంట్రీ పాడైపోతుంది.
డ్రగ్సును అవాయిడ్ చేయండి
డ్రగ్సును అవాయిడ్ చేయండి. నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. అరే ఒక్కసారి ట్రై చేయరా తర్వాత వదిలేద్దాం అని నేర్పించే బ్యాచ్ ఒకటి ఉంది. ఒక్కసారి అలవాటు చేసుకుంటే మళ్లీ దానిని వదులుకోవటం చాలా కష్టం. అందుకనే మొదటి స్టెప్ ఏ కట్ చేయాలి. మన చుట్టుపక్కల రకరకాల మనుషులను కలుస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్లకు చెప్పాలి. వాళ్లు వినకపోతే వాళ్ల నుంచి దూరంగా ఉండటం బెటర్. మనం ఎఫెక్ట్ కాకూడదు. బాడీ ఫిట్ గా ఉండి మంచి బట్టలు వేసుకుంటే లైఫ్ లో ఒక హై వస్తుంది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు హై వస్తుంది. డ్రగ్స్ ఇవన్నీ టైం వేస్ట్. మీ కెరీయర్ ను ఇవన్నీ నాశనం చేసే పనులు. మీకు జీవితంలో హై కావాలంటే సాలిడ్ గా వర్కౌట్ చేయండి. సక్సెస్ ను చేజ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా సొసైటీ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది.
Also Read : Thammudu Movie: ఫస్ట్ టైమ్ పార్ట్నర్ ను మార్చిన దిల్ రాజు, ఇక తమ్ముడు సేఫ్ జోన్ లోనే