Viral Video: సాధారణంగా కొన్ని వార్తలు ప్రజలను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి వార్తల్లో ఒకటి తాజాగా శ్రీకాకుళంలో జరిగింది. ఆకాశం నుంచి మేఘాలు కింద పడ్డాయంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ తెల్లటి మేఘం ఆకారంలో ఉన్న నురగ పొలాల్లో కనిపించింది. దీనిని చూసి స్థానికులు మేఘాలు నేల మీదపడ్డాయంటూ.. సదరు వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. దానిని చూసిన నెటిజన్లు నిజమేనేమో అనుకున్నారు. ఈ వీడియోకు కొందరు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. భూమ్మీద పాపాలు పెరిగిపోవడం వల్లే ఇలాంటి వింత ఘటనలు జరుగుతున్నాయంటూ వింత భాష్యాలు చెప్పారు. ఎవరికి తెలిసిన పద్దతుల్లో వాళ్లు తమ ఒపీనియన్స్ వెల్లడించారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
సాధారణంగా ఆకాశం నుంచి మేఘాలు కిందపడటం అనేది జరగదు. నిజానికి మేఘాలకు ఓ నిర్ధిష్టమైన ఆకారం అంటూ ఉండదు. ఇంతకీ శ్రీకాకుళంలో నేల మీద పడింది ఏంటి? అనే అనుమానం మీకు కలగవచ్చు. అది మేఘం కాదు. ఒకరకమైన కెమికల్స్ తో కూడిన నురగ. కొన్ని ఫ్యాక్టరీల నుంచి విడుదలైన విష వాయువులు ఇలా మేఘంలా మారుతాయి. గాల్లో ఎగిరిపోతాయి. కొన్నిసార్లు నీటి ప్రవాహాల్లోనూ ఇలాంటి నురగ పెద్ద మొత్తంలో ఏర్పడుతుంది.
ఈ నురగను ముట్టుకోవచ్చా?
నిజానికి ఈ కెమికల్స్ తో ఏర్పడిన నురగను ముట్టుకోవడం కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే, ఆ నురగ అనేవి అత్యంత హానికరమైన కెమికల్స్ తో ఏర్పడుతాయి. వాటిని ముట్టుకోవడం వల్ల ఆ నురగలోని విష రసాయనాలు శరీరంలోకి వెళ్లి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే, ఎక్కడైనా ఇలాంటి నురగ కనిపించినా ముట్టుకోకూడని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: సైడు నుంచి చూస్తే.. కారు అనుకుంటారు.. ముందుకెళ్లి చూస్తే మబ్బు విడిపోద్ది!
మేఘాలు నేల మీద పడటం సాధ్యమేనా?
సో, మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో మేఘాలు నేల మీద పడ్డాయనడంలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో వాస్తవమే అయినప్పటికీ, అది మేఘం కాదు. కెమికల్స్ తో కూడిన నురగలాంటి పదార్థం. ఇప్పటి వరకు మేఘాలు నేల మీద పడిన సంఘటనలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలా పడుతాయి అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. అయితే, ప్రజలు తెల్లటి పదార్థాన్ని చూసి మేఘం అని భ్రమపడటం వాస్తవం. ఆ తర్వాత ప్రజలకు అసలు నిజం తెలియడంతో అందరూ లైట్ తీసుకున్నారు. కానీ, అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించింది. బోలెడు చర్చలు కారణం అయ్యింది. ఆకాశం నుంచి దేవుడి వరకు ఎవరికి తోచిన కామెంట్ వాళ్లు చేశారు. నిపుణులు ఈ మేఘం గురించి అసలు కథ చెప్పడంతో ఇప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు.
Read Also: తల మీద కారు.. 14 సెకెన్లలో 100 మీటర్ల పరుగు, ఈ అరుదైన వ్యక్తుల గురించి మీకు తెలుసా?