E-Paper
Advertisement

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు  వైరల్ కామెంట్స్ !
Advertisement

P Murali Dhar Rao: రేవంత్ రెడ్డి క్యాబినేట్ నుండి కొండా సురేఖ బర్తరఫ్ అయిన వ్యవహారం ఇపుడు మిగతా పార్టీల్లో మంటలు పెట్టిస్తుంది.ఇప్పటికే కొండా సురేఖ వస్తే తెలంగాణా భవన్ గేట్లు కూడా తీసేది లేదు అంటూ బీఆర్ యస్ నేత జగదీశ్వర్ రెడ్డి మీడియా ముందు తెగేసి చెప్పిన సంగతి తెల్సిందే.అయితే గత కొన్ని రోజులుగా సురేఖ బీజేపీలోకి వెళ్తుందన్న వార్తలు మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.

ఇక కొండా సురేఖని బీజేపీలోకి తెచ్చేందుకు నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ తన శాయాశాక్తులా కృషి చేస్తున్నాడని వినిపిస్తుంది.ఇక కొండా సురేఖ వరంగల్ జిల్లాలో బలమైన పొలిటీషియన్ కాబట్టి వస్తే మంచిదే అంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు కూడా.

Advertisement

అయితే బీజేపీలోకి కొండా సురేఖ ఎంట్రీపై ఉత్తర తెలంగాణకు చెందిన మరొక ముఖ్యమైన ఎంపీ అంత ఇష్టం చూపించట్లేదన్న వార్తలు కూడా వినిపించాయి.అయితే వీటన్నింటిని పక్కన పెడితే తాజాగా బీజేపీ సీనియర్ నేత పి. మురళీధర్ రావు ఈ వ్యవహారంపై చేసిన కామెంట్స్ ఇపుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ ని పెంచేశాయి.

BJP is NOT a BIN

తాజాగా ఆయన తన X లో “BJP is NOT a BIN” అంటూ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో పదవులు పోయినా, అసంతృప్తి పెరిగినా బీజేపీని ఒక డస్ట్ బిన్ లా వాడేస్తున్నారని,అది ఎంత మాత్రం సరైన పద్దతి కాదని తేల్చి చెప్పారు. తమ పార్టీకి ఒక సిద్ధాంతం, బలమైన కేడర్ ఉన్నాయని, ఇతర పార్టీల్లో సమస్యలు రాగానే అందరినీ చేర్చుకుంటూ పోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

డైలమాలో కొట్టుమిట్టాడుతున్న బీజేపి 

Advertisement

ఇక తాజాగా పి. మురళీధర్ రావు పెట్టిన పోస్ట్ ని బట్టి చూస్తే కొండా సురేఖకి బీజేపీలోకి ఎంట్రీ అంత ఈజీ కాదని అర్థమైపోతుంది.ఇక ఇదే విషయమై బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ సురేఖ చేరికపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని ఆమె స్పష్టం చేయడం విశేషం.మొత్తానికి బీజేపి తీరు చూస్తుంటే ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకోవాలా ,లేక పార్టీ సిద్ధాంతాలకే ప్రాధాన్యం ఇవ్వాలా అనే డైలమాలో కొట్టుమిట్టాడుతున్నట్టే కనిపిస్తుంది.

సురేఖ కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడతారా?

నిజానికి నేను కాంగ్రెస్ లోనే ఉంటాను,మరో పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదు అని కొండా సురేఖే స్వయంగా మీడియా ముందు చెప్పినప్పటికీ ఇలా నెటింట్లో ఇబ్బడి ముబడిగా వార్తలు చక్కర్లు కొట్టడం గమనార్హం.

ALSO READ:గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

ఇక సురేఖ విషయానికి వస్తే, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులకు బలమైన క్యాడర్, సొంత ఇమేజ్ ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మొత్తానికి ప్రస్తుతం ప్రచారంలో ఉన్నదంతా పొలిటికల్ రూమర్స్ వరకే అని అర్థం అవుతుంది. సురేఖ వైపు నుంచి గానీ, బీజేపీ నుంచి గానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే లేదు .మరి కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడతారా? లేక ఏదైనా సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేస్తారా అన్నది కాలమే డిసైడ్ చేయాలి!

 

Tags

Related News

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×