OBC Census: గాంధీ భవన్ సమావేశంలో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన నినాదం ఉద్యమంలా మారిందని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి శాస్త్రీయంగా కుల సర్వే చేశారు. కుల సర్వేలో తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని కొనియాడారు. 100 రోజుల పాటు బీసీ హక్కుల గర్జన కార్యక్రమం జరగబోతుందని, కొప్పుల రాజు, సిడబ్ల్యుసి సభ్యులు గత ఐదు ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గే జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని మోదీపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని దేశ వ్యాప్తంగా ఉద్యమంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలిపారు.
జనాభా లెక్కలతో ఓబీసీ కులగణన జరుగుతుందని బీహార్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి మోదీ చెప్పారు. జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని, కానీ జనాభా లెక్కల్లో ఓబీసీ కులగణనను కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు మహేష్ గౌడ్ అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని నిలదీసిందని అన్నారు. ఫ్యామిలీ సర్వేతో పాటు ఓబీసీ కులగణన చేస్తామని పార్లమెంట్ లో అమిత్ షా చెప్పారు. కానీ ఫామ్‌లో ఓబీసీ ప్రస్తావన లేదని అన్నారు. తెలంగాణలో కులగణన చేసినప్పుడు ఓబీసీ కుల సంఘాలతో మాట్లాడి 134 ఓబీసీ కులాలను గుర్తించారు. తెలంగాణలో పర్ఫెక్ట్ గా ఓబీసీ కులగణన జరిగిందని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం సోషియో ఎకనమిక్ సర్వే చేసినప్పుడు 46 లక్షల కులాలు వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం చేసేది కచ్చితమైన ఓబీసీ జనగణన కాదని మహేష్ గౌడ్ అన్నారు.
Also read: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!
ఓబీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి అనేది లెక్కించడం సాధ్యం కాదు. ఓబీసీ సామాజిక న్యాయ అజెండా పదేళ్లుగా నెరవేరడం లేదు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 50 శాతం సీలింగ్ విధించిందని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నాంమని తెలిపారు. ఓబీసీ కులాల డేటా ఖరారు అయితే రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్ ఎత్తివేయవచ్చని అన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉంది. తెలంగాణలో కేసీఆర్ సమగ్ర సర్వే చేసినప్పుడు ఓబీసీ డేటా లేకుండా చేశారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీ కులగణన చేపట్టాలని, ఓబీసీలకు దేశంలో అందాల్సిన ఫలాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని మహేష్ గౌడ్ తెలిపారు.
దీనిపై మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరూ ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు. ఓబీసీ హక్కుల కోసం 100 రోజులు కార్యక్రమాన్ని ఏఐసీసీ తీసుకుందని, తెలంగాణ మోడల్‌ను ఫాలో కావాలని ఏఐసీసీ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తోందని తెలిపారు. కులాల అడ్డుగోడలతోనే దేశంలో సమానత్వం రాలేదు. కులాల లెక్కలతోనే ఏ కులం ఎంత వెనకబడి ఉంది అనేది తెలుస్తుందని అన్నారు. 50 శాతం జనాభా వద్ద కేవలం 3 శాతం సంపద ఉందని, పెద్ద,పెద్ద కాంట్రాక్టులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో గమనించాలని అన్నారు. అగ్రవర్ణాల వారి చేతుల్లోనే పెద్ద కాంట్రాక్టులు ఉన్నాయి. సరైన గణన, గణాంకాలు సాధించాలని అనుకుంటున్నామని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Also read: డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్!