POCO X8 Series: సాధారణంగా స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ చూసేది రెండే రెండు విషయాలు. ఒకటి బ్యాటరీ లైఫ్, రెండోది ఫోన్ లైఫ్. ఈ రెండింటిలో రాజీ పడకుండా ప్రముఖ Poco సంస్థ భారతీయ మార్కెట్లోకి Poco X8 సిరీస్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇందులో Poco X8, Poco X8 Power అనే రెండు మోడళ్లను తీసుకొచ్చింది. రోజువారీ వాడకంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండటానికి ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ వీటి బ్యాటరీ సామర్థ్యమే. బేసిక్ మోడల్ Poco X8లో ఏకంగా 9000mAh బ్యాటరీ ఇస్తుండగా.. Poco X8 Power మోడల్‌లో భారీ 10000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. X8 ఫోన్ 67W వేగానికి సపోర్ట్ చేస్తే, పవర్ వేరియంట్ 100W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది. దీంతో బ్యాటరీ ఎంత పెద్దగా ఉన్నా చాలా వేగంగా ఛార్జ్ అయిపోతుంది.
Also Read: గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!
రెండు ఫోన్లలోనూ 6.83 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌లను ఇచ్చారు. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి వీడియోలు చూడటం లేదా గేమ్స్ ఆడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కోసం X8 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ వాడగా, X8 పవర్ మోడల్‌లో మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6 Gen 5 ప్రాసెసర్‌ను జత చేశారు. ఇవి రోజూవారీ పనులను చాలా సులువుగా హ్యాండిల్ చేస్తాయి.
ఈ రెండు హ్యాండ్ సెట్స్‌లోనూ 50MP ప్రధాన కెమెరా ఉంది. అయితే పవర్ మోడల్‌లో అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ సదుపాయం ఇచ్చారు. ఈ ఫోన్ల మరో పెద్ద ప్లస్ పాయింట్ రక్షణ. రెండింటికీ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కోటింగ్ తో పాటు IP68, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. అంటే.. నీటిలో పడినా, ధూళి పడినా ఫోన్‌కు ఏమీ కాదు.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ OS 3పై పనిచేసే ఈ ఫోన్లకు నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు లభిస్తాయి. Poco X8 ధర రూ.29,999 కాగా.. Poco X8 power ధర రూ.35,999గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లతో రూ.3,000 వరకు తగ్గుతుంది. ఇవి సెప్టెంబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు వస్తాయి.
Also Read: ఇన్ఫినిక్స్ నుండి రంగులు మారే కొత్త ఫోన్.. బడ్జెట్‌లో కిర్రాక్ ఫీచర్లు!