E-Paper
Advertisement

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!
Advertisement

Konda Surekha: రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి తనని తప్పించడంతో మాజీ మంత్రి కొండా సురేఖ మీడియా ముందు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.ఉరిశిక్ష వేసే ఖైదీకైనా ఆ విషయం ముందుగా చెబుతారని కానీ తనకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కనీసం తన అభిప్రాయం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా తనను తప్పించడం సరికాదంటూ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో,ముఖ్యంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఏ ఒక్క మంత్రి కూడా ప్రస్తుతం సంతోషంగా లేరంటూ సంచలన కామెంట్స్ చేశారు కొండా సురేఖ.ముఖ్యంగా సీయం రేవంత్ రెడ్డి పరిపాలనపై,అలాగే ఆయన వ్యవహరిస్తున్న తీరుపై అటు మంత్రులలో,ఇటు MLAలలో ..ఇలా అందరిలో తీవ్రమైన అసంతృప్తి ఉందని,ఆ విషయం వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని పిలుపునిచ్చారు.

అసలెందుకు నన్ను బర్తరప్ చేశారు 

Advertisement

ఇక ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళు అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వాళ్ళ ప్రజలలో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేఖత ఉందని చెప్పుకొచ్చింది.ఇక ఇప్పటికైనా ప్రభుత్వం సర్వేలు చేయించి ప్రజలలో ఉన్న ఆ వ్యతిరేఖతని, అసంతృప్తిని తెలుసుకుని దానిని సరిదిద్దాలని చెప్పుకొచ్చారు.

తనను పదవి నుంచి తీసేస్తున్నట్టు డిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, తనకు ఒక్క మాట చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తనకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే, తనే రాజీనామా చేసి గౌరవంగా పక్కకు తప్పుకునేదాన్ని కదా అని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో తనను బర్తరఫ్ చేశారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజానికి కాంగ్రెస్ హైకమాండ్‌కు తనను తొలగించడం ఎంతమాత్రం ఇష్టం లేదని, కేవలం రేవంత్ రెడ్డి కావాలని పట్టుబట్టి మరీ తనను క్యాబినెట్ నుంచి తీసేశారని కుండబద్దలు కొట్టేశారు కొండా సురేఖ.

పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అంటే ఎలా 

Advertisement

ఇక రేవంత్ రెడ్డిపై సురేఖ ఘాటుగా స్పందిస్తూ..రాబోయే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ చెప్పడం ఎంతమాత్రం సరికాదన్నారు. అలాగే పార్టీ పరంగా ప్రకటించాలసిన MLA అభ్యర్థులని ఇలా ఎలాంటి సరైన ప్రక్రియ లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీని, ఇందిరా గాంధీని తీవ్రంగా విమర్శించిన మల్లు రవి, జైపాల్ రెడ్డి, రోశయ్య వంటి వారికి కూడా పార్టీలో పెద్ద పీట వేశారని గుర్తుచేశారు. అంతేకాకుండాగతంలో రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన వారికి కూడా పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారని,కానీ ఒక బీసీ మహిళనైన తనపై కావలని కక్ష్య కట్టి మంత్రి పదవి ని నుండి తొలగించారని వాపోయారు.

ఇంట్లో భార్య కుడా ఓటు వేయదు 

ఇక ఈ మధ్య తన మాజీ OSD సుమంత్ పై నమోదైన కేసు విషయంలో స్పందిస్తూ, ఆ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కిరణ్ అనే వ్యక్తి విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే నిజం సుమంత్ బయటపెట్టినందుకే, అతనిపై కక్షపూరితంగా కేసులు పెట్టి అతని కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.ఇదే విషయంలో సజ్జనార్ మీడియా ముందుకు రావద్దని చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.ఇక కనీసం బజారులో కాదు, ఇంట్లో భార్య కుడా ఓటు వేయని వ్యక్తులకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు.

ఉత్తరం వెనుక పెద్ద కుట్ర

ఇక మరోవైపు తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఉత్తరం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఎలాంటి అడ్రస్, సంతకం లేని ఆ దొంగ లేఖను ఎవరు వైరల్ చేస్తున్నారో తేలాలని అన్నారు. తన పదవి పోయినప్పటికీ తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు మంత్రిపదవులు రావడం చాలా మంచి పరిణామమని, మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సోషల్ బ్యాలెన్స్ చేయడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.

ALSO READ:ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

కొండా వారి రియాక్షన్ కి కౌంటర్ ఎలా వస్తుందో !

మొత్తంగా క్యాబినెట్ నుండి బర్తరఫ్ అయిన సురేఖ మొదటి సారి మీడియా ముందుకు వచ్చి సీయం రేవంత్ అండ్ AICC పై చేసిన సంచలన కామెంట్స్ ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. చూడాలి కొండా వారి రియాక్షన్ కి కౌంటర్ ఎలా వస్తుందో !

Tags

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×