E-Paper
Advertisement

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?
Advertisement

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు? గురువారం సాయంత్రం మీడియాతో చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఆమె ప్రెస్ మీట్ చూసినవాళ్లు మాత్రం, పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పలువురు రాజకీయ నేతలు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వెనుక అసలు కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

మాజీ మంత్రి  కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. చెప్పాల్సిన వన్నీ చెప్పేశారు.. కాంగ్రెస్ పార్టీ కంటే, ఎక్కువగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.  ఆయనకు టీడీపీ వాసన పోలేదంటూ ప్రస్తావించారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఉండరని చాలామంది నేతలు భావించారు.

Advertisement

ఈ క్రమంలో ఆమె మా వైపు వద్దంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు పోస్టు పెట్టారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంగా కారు పార్టీ నుంచి బయటకు వచ్చేశారని రాసుకొచ్చారు. మీడియా సమావేశం జరుగుతుండగా సురేఖ పక్కన ఆమె భర్త లేరు. మేడ మీద మీసాలు తిప్పుతూ కనిపించారు. అప్పుడే కొండా దంపతులు పార్టీ నుంచి మారడం ఖాయమని డిసైడ్ అయ్యారు.

త్వరలో భారీ అప్‌డేట్, ‘స్టే ట్యూన్డ్ తెలంగాణ అంటూ ప్రస్తావన

అయితే, శుక్రవారం మాజీ మంత్రి కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్ బుక్‌లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’ అని అందులో ఉంది. అంతేకాదు ‘బిగ్ అప్‌డేట్ ఈజ్ కమింగ్ సూన్’ అంటూ హింట్ ఇచ్చారు. ‘స్టే ట్యూన్డ్ తెలంగాణ’ అంటూ ఆసక్తి పెంచారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ గురించి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ఆసక్తి రేపింది.

Advertisement

కాంగ్రెస్‌లో  కొనసాగుతారా? కీలక నిర్ణయం తీసుకుంటారా? తన రాజకీయ భవిష్యత్‌పై ఏదైనా ప్రకటన చేయబోతున్నారా? ఇదే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. భర్త కొండా మురళితో కలిసి తదుపరి కార్యాచరణపై ప్రకటన ఉంటుందా? అనే ప్రశ్నలు వెలువడ్డాయి. అయితే, కొండ సురేఖ టీమ్.. ఈ విషయాన్ని కొట్టి పడేసింది. అది ఫేక్ అకౌంట్ అని. ఆ పోస్టుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ALSO READ: తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×