Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌కు సంబంధించి సెక్యూరిటీ రహస్య వివరాలను పోస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదైంది. సీఎం ప్రధాన భద్రతాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
జులై 13న ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఆయనకు సంబంధించి మినిట్ టు మినిట్ కార్యక్రమం, ముఖ్యమంత్రి జడ్ ప్లస్ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఢిల్లీలో షెడ్యూల్ వారీగా బందోబస్తు, ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు, డీజీపీ కొందరు అధికారులకు వైర్‌లెస్ సందేశం ఇచ్చారు. జడ్ ప్లస్ స్థాయికి తగినట్టుగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం బ్లడ్ గ్రూపు, ప్రధాన భద్రతాధికారి ఫోన్ నంబర్లను ఆ సందేశంలో పేర్కొన్నరు.
ఆ రోజు రహస్య సమాచారాన్ని తెలుగు స్క్రైబ్ తమ ఎక్స్ ఖాతాలో వివరాలు బయట పెట్టింది. ఈ విషయాలు చూసి ఖంగుతిన్నారు సీఎం సెక్యూరిటీ అధికారులు. ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుండగా వివరాలు బయటకు వచ్చాయి. వైర్ లైస్ సమాచారాన్ని బహిరంగం చేయడానికి అనుమతి ఉండదు. అత్యంత రహస్యంగా ఉండే ఈ సమాచారం ఎలా బయటకు వచ్చింది? దీనిపై అన్ని కోణాల్లో ఆరా తీసిన సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కేబీ ఫ్రాంక్లిన్.. జులై 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన విషయాలు బయటకు రావడం భద్రతకు ముప్పు కలిగించే చర్య ఫిర్యాదులో ప్రస్తావించారు.
అధికారుల్లో ఎవరో ఒకరు ఈ సమాచారం లీక్ చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు కోసం సైబర్ క్రైమ్‌కు ఈ కేసును బదిలీచేశారు. ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. మరోవైపు కేసు నమోదుపై తెలుగు స్క్రైబ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యింది. సీఎం పర్యటనలపై వార్త రాసినందుకు కేసు పెట్టడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ చేశారని ప్రస్తావించింది.
ALSO READ: రేవంత్ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు