E-Paper
Advertisement

“చిల్లర నా కొ..” అంటూ రెచ్చిపోయిన KTR.. పోలీసులతో రచ్చ!

“చిల్లర నా కొ..” అంటూ రెచ్చిపోయిన KTR.. పోలీసులతో రచ్చ!
Advertisement

KTR Revanth:ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు, వెయ్యి డప్పులతో చావు డప్పు కొట్టాలని పిలుపునిచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బయలు దేరిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో శాంతి భద్రతల దృష్ట్యా హకీంపేట వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావ్ అలాగే మిగతా mla లని అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.

ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు కేటీఆర్.తనని ఎందుకు అడ్డుకుంటున్నారని, దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలని ఆపకుండా మమ్మల్ని ఇలా మధ్యలో అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు.ఈ సందర్బంగా మాటామాటా పెరగడంతో అక్కడ పరిస్థితి కొంతసేపు వేడెక్కింది.

‘చిల్లర నా కొ..’రేవంత్ రెడ్డి

Advertisement

పోలీసులు ఎంత చెప్పినా కేటీఆర్‌ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు మరింత నచ్చజెప్పాలని ప్రయత్నించారు.ఈ క్రమంలో నిగ్రహం కోల్పోయిన ఒక్కసారిగా సీయం ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతు పురాణానికి తెర తీశారు. కేసీఆర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ‘చిల్లర నా కొ..’రేవంత్ రెడ్డి అనే ‘చిల్లర నా కొ..’రౌడీలని ఎస్కార్ట్ పెట్టి మరీ చంపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్నారు.

దీంతో అక్కడ ఉన్న పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం మరింత ముదిరిపోయింది.ఇక ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడిన తీరుపై కూడా పోలీసులు కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక పోలీసుల మాటల్ని లెక్క చేయకుండా రోడ్డుపై ధర్నాకి దిగిన కేటీఆర్ మరియు మిగతా mlaలని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.

ఆ బూతు మాటలు ఏంటి

Advertisement

మరో వైపు బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం ఏంటని, పైగా రాష్ట్రానికి సీయంగా ఉన్న వ్యక్తిని పట్టుకుని ఆ బూతు మాటలు ఏంటి అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

ALSO READ:ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు.. మధ్యలోనే అరెస్ట్

ఏది ఏమైనా ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద నిరసన కార్యక్రమాలు చేసి వెయ్యి డప్పులతో దండోరా మోగిస్తామన్న కాంగ్రెస్ హెచ్చరిక ఇపుడు రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తుంది.మరి సీయం పై బూతు పదాలతో రెచ్చిపోయిన కేటీఆర్ మాటల్ని కాంగ్రెస్ ఎలా తీసుకుంటుంది.రాబోయే రోజుల్లో ఈ బూతులకి బిఆర్ఎస్ ఎలాంటి ఋణం చెల్లించుకోబోతుంది అనేది కాలమే డిసైడ్ చేయాలి !

 

Tags

Related News

బూతులు, బట్టలు విప్పడాలు.. ఇదేం దారుణం..కూనంనేని ఫైర్

అదో దెబ్బ, దానికో పరామర్శ.. టీవీలు చూస్తూ నవ్వుకుంటున్నారు.. బండి సెటైర్లు!

తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో విషాదం.. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ రాజు మృతి!

ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు.. మధ్యలోనే అరెస్ట్

మీడియా ముందు భావోద్వేగానికి గురైన స్పీకర్.. హరీష్ రావుపై ఫైర్!

ఎర్రవెల్లి వైపు కాంగ్రెస్ శ్రేణులు.. కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?

Big Stories

Advertisement
×