E-Paper
Advertisement

BRS: కేటీఆర్ ఫెయిల్యూర్.. టార్గెట్ హరీష్ రావు, కేసీఆర్ అసలు వ్యూహం ఇదేనా..?

BRS: కేటీఆర్ ఫెయిల్యూర్.. టార్గెట్ హరీష్ రావు, కేసీఆర్ అసలు వ్యూహం ఇదేనా..?

తెలంగాణ రాజకీయ యవనికపై దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యం చ‌లాయించిన బీఆర్ఎస్‌ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లో ప‌ల‌కరించిన‌ వ‌రుస ప‌రాజ‌యాల‌తో పార్టీ గ్రాఫ్ పడిపోవడం గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఫెయిల్ అయ్యార‌నే వాద‌నపై తెలంగాణ భ‌వ‌న్‌లో జోరుగా చ‌ర్చ‌న‌డుస్తోంది. దీంతో పార్టీలో నాయ‌క‌త్వ ప‌గ్గాల‌పై నేత‌ల మ‌ధ్య అభిప్రాయ భేదాలు త‌లెత్తిన‌ట్టు స‌మాచారం.

పార్టీ వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో ఈసారి హ‌రీష్ రావుకు బాధ్య‌త‌లు ఇచ్చి పార్టీని గాడిలో పెట్టేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని ఓ వ‌ర్గం నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న‌ట్టు స‌మాచారం. దీన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ పార్టీ ప్ర‌క్షాళ‌న‌, యువ‌త‌కు అవ‌కాశాల పేరుతో హ‌రీష్ రావుకు ద‌గ్గ‌ర‌గా ఉండే సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించిన‌ట్టు స‌మాచారం. సంక్రాంతి త‌రువాత పార్టీలో అధినేత కేసీఆర్ చేపట్టబోతున్న మార్పులపై ఇప్పుడు బీఆర్ఎస్‌లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

వైఫల్యాలతో మసకబారిన కేటీఆర్ ఇమేజ్

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ వరుస పరాజయాలను మూటగట్టుకోవడం ఇప్పుడు ఆయన సామర్థ్యాల‌పైనే ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేటీఆర్ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌నీసం పోటీకి పార్టీ అభ్య‌ర్థ దొర‌క్క‌పోవ‌డం, కంటోన్మెంట్‌-జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌ల్లో ఓట‌మి కేటీఆర్ ఇమేజ్‌ను దెబ్బ‌తీశాయి.

ఈ ప‌రిణామాలు కేటీఆర్ నాయ‌క‌త్వంపై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాయి. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో సగం పంచాయతీలను కూడా గెలిపించుకోలేకపోవడం కేటీఆర్‌కు పెద్ద మైన‌స్‌గా ప‌రిణ‌మించింది. కేటీఆర్ కేవ‌లం హైటెక్ రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చి, క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించారనే విమర్శ సీనియర్ల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు, అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధిపేట‌లో హ‌రీష్ రావు స‌త్తాచాటుతున్నార‌ని, ఆయ‌న‌కు ఒక్క‌సారైనా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే డిమాండ్లు తెలంగాణ భ‌వ‌న్‌లో వినిపిస్తున్నాయి.

యువతకు ఛాన్స్.. అసలు వ్యూహం అదేనా?

హ‌రీష్ రావుకు ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని న‌డుస్తున్న చ‌ర్చ‌ను కేసీఆర్ ప‌సిగ‌ట్టిన‌ట్టు స‌మాచారం. దీంతో హ‌రీష్ రావుకు ద‌గ్గ‌ర‌గా ఉండే సీనియ‌ర్ల‌ను ప‌క్క‌కు త‌ప్పించాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్టు తెలిసింది. హ‌రీష్ రావు వ‌ర్గాన్ని నిలువ‌రించి కేటీఆర్ వైపు నిలిచే నాయ‌క‌త్వాన్ని త‌యారు చేసే ప‌నిలో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలంగాణ భ‌వ‌న్‌లో చ‌ర్చ న‌డుస్తోంది. అందులో భాగంగానే సంక్రాంతి తర్వాత నియోజకవర్గ ఇంచార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల మార్పున‌కు గులాబీ బాస్ శ్రీకారం చుట్టిన‌ట్టు ప్ర‌ర‌చారం జ‌రుగుతోంది.

టార్గెట్‌ హ‌రీష్ రావు..

యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే నెపంతో హరీష్ రావుకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేతలను పక్కన పెట్టడం ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా వచ్చే యువ నేతలు సహజంగానే కేటీఆర్ ఆలోచనా విధానంతో నడిచేలా చూసుకోవడం ద్వారా, పార్టీపై ఆయన పట్టును మళ్లీ పెంచాలని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సీనియర్ల అసమ్మతి బ‌హిర్గ‌తం కాకుండా వారిని వ‌యోభారం నెపంతో ప‌క్క‌కు త‌ప్పించి, పార్టీని పూర్తిగా కేటీఆర్ కంట్రోల్‌లోకి తీసుకురావడమే ఈ పునర్వ్యవస్థీకరణ అసలు లక్ష్యమని భావిస్తున్నారు. త‌ర్వ‌లో జ‌ర‌గ‌బోయే బీఆర్ఎస్ నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లా అధ్య‌క్షుల మార్పు హ‌రీష్ రావు టార్గెట్‌గా జ‌ర‌గ‌నుంద‌నే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది.

ALSO READ: Harish Rao: లోకేష్ బాటలో హరీష్ రావు.. ‘రెడ్ బుక్’లో వాళ్ల పేర్లు?

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×