E-Paper
Advertisement

Harish Rao: లోకేష్ బాటలో హరీష్ రావు.. ‘రెడ్ బుక్’లో వాళ్ల పేర్లు?

Harish Rao: లోకేష్ బాటలో హరీష్ రావు.. ‘రెడ్ బుక్’లో వాళ్ల పేర్లు?

ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పు కోసం లేదా పదోన్నతుల కోసం అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను తాము వదిలిపెట్టబోమని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే అధికారుల పేర్లను తాము ప్రత్యేకంగా నోట్ బుక్ లో రాసి పెడుతున్నామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వారు రిటైర్ అయినా లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పోలీస్ బాస్ వ్యాఖ్యలపై హరీష్ ధ్వజం

డీజీపీ శివధర్ రెడ్డికి హరీష్ రావు సూటిగా వార్నింగ్ ఇచ్చారు. ఖాకీ బుక్ గురించి మాట్లాడుతున్న డీజీపీ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. పోలీసుల సంక్షేమం గురించి ఆలోచించాలని.. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. ప్రస్తుత ఖాకీ బుక్ లో న్యాయం కూడా అంతే ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చెప్పగానే నోటీసులు ఇవ్వడం కాకుండా.. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలు – డైవర్షన్ పాలిటిక్స్

కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందని అన్నారు. అందుకే రాత్రి 9 గంటల తర్వాత సీఎం చిట్ చాట్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని హరీష్ విమర్శించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో రాత్రిపూట సీఎంలు చిట్ చాట్ చేయడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వాస్తు భయంతో సచివాలయానికి వెళ్లడం లేదని ఆరోపించారు. గేట్లు, దారులను మార్చినా ప్రయోజనం లేక జూబ్లీహిల్స్ ప్యాలెస్ లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల్లో ప్రభుత్వం విఫలమైందని.. ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు.

కమిషన్ల సర్కార్ – అప్పుల కుప్ప

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతోందని హరీష్ రావు ఆరోపించారు. 10 వేల కోట్ల లోన్ కోసం ప్రభుత్వ భూములను కుదువ పెడుతున్నారని.. దీని కోసం రూ. 182 కోట్లు బ్రోకర్ కమిషన్లుగా చెల్లిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. బాంబే బ్రోకర్ కి రాష్ట్రంలో మరో బ్రోకర్ తోడై జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేస్తున్నారని, దీని వల్ల కేవలం బ్రోకర్లకే లాభం తప్ప తెలంగాణకు నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ద్రోహమని.. గతంలోనూ ఇప్పుడూ తెలంగాణకు అన్యాయమే చేస్తోందని మండిపడ్డారు.

అసెంబ్లీలో సమాన అవకాశం

అసెంబ్లీలో ప్రభుత్వం పీపీటీ ప్రజెంటేషన్ చేయాలనుకుంటే.. ప్రతిపక్షంగా తమకు కూడా అవకాశం ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు. ఎంఐఎం, బీజేపీకి ఎక్కువ సమయం ఇస్తున్నప్పటికీ.. తమ సభ్యుల సంఖ్యను బట్టి తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి తనపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఫార్ములా ఈ రేసు వంటి అంశాల్లో కేటీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రేవంత్ తనపై కేసులు పెట్టినా.. దాడులు చేయించినా భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.

ALSO READ: KCR vs Ministers : కేసీఆర్‌ను కార్నర్ చేస్తున్న మంత్రులు.. ఎవరిది పైచేయి!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×