E-Paper
Advertisement

Legislative Sports: రేపే శాసన సభ్యుల క్రీడోత్సవాలు.. ఎల్బీ స్టేడియంలో గేమ్స్.. ఇక అంతా సిద్ధం!

Legislative Sports: రేపే శాసన సభ్యుల క్రీడోత్సవాలు.. ఎల్బీ స్టేడియంలో గేమ్స్.. ఇక అంతా సిద్ధం!
Advertisement

Legislative Sports: రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు నిర్వహించబోతున్నారు. దాదాపు 12ఏళ్ల తర్వాత నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఎల్బీ స్టేడియంలో క్రీడలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా పోటీల ఏర్పాట్లను శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి పరిశీలించారు. సిబ్బందికి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

ఈ నెల 28 నుంచి స్టేడియంలో ఫస్ట్ ఎడిషన్ లెజిస్లేటీవ్ స్పోర్ట్స్ మీట్-2026 నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో క్రీడలపై అవగాహన తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శాసన, మండలి సభ్యుల క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. ఈ పోటీలలో టగ్ ఆఫ్ వార్, ఫుట్ బాల్, క్రికెట్ అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తోపాటు కొన్ని రిక్రియేషనల్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నామని తెలిపారు.

Advertisement

Also Read: 30 Days Plans 2026: టెలికాం మోసాలకు చెక్.. 28 రోజులు కాకుండా.. పూర్తి నెల వచ్చే ప్లాన్స్ ఇవే!

ప్రజాప్రతినిధుల క్రీడలను ఎవరైనా ఉచితంగా వీక్షించవచ్చని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి స్పష్టం చేశారు. వీక్షకుల సౌకర్యాలకు సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్టేడియంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Also Read: BSNL Plans: చౌకైన కొత్త వార్షిక ప్లాన్స్.. ఏడాది పాటు రోజూ 2.5 GB, ఫ్రీ కాల్స్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్లు!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×