E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారస్తులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారస్తులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 4వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 

మిథునం

దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. 

కర్కాటకం

Advertisement

ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి.

సింహం

అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. 

కన్య

ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. 

ధనుస్సు

గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.  

మకరం

గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. 

కుంభం

వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి.

మీనం

కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.  వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×