E-Paper
Advertisement

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas: 200 కోట్ల రూపాయిల‌కు పైగా ఖ‌ర్చుతో.. మేడారం ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్ప‌టికీ దాదాపు 95 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని వెల్ల‌డించారు.

సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో ఈ మేర‌కు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ .. కనీసం 200 సంవ‌త్స‌రాల‌కు పైగా నిలిచేలా రాతి క‌ట్ట‌డాల‌తో ఆధునీక‌ర‌ణ‌ప‌నులు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ఈ మేడారం చుట్టుప‌క్క‌ల సుమారు 10 కిలోమీట‌ర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికే ఆధునీక‌ర‌ణ ప‌నుల కోసం 29 ఎక‌రాల భూమిని అధికారికంగా సేక‌రించామ‌ని తెలిపారు.

Advertisement

భక్తులకు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు మ‌రో 63 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌కు నిర్ణ‌యించామ‌ని వెల్ల‌డించారు.
ఈనెల 29 నుంచి 31 వ‌ర‌కు జ‌రిగే మేడారం జాత‌ర కోసం కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో నిర్ల‌క్ష్యానికి గురైన ఈ మేడారం జాత‌ర, ఏర్పాట్లు, ఆధునీక‌ర‌ణ వంటి అంశాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తాను, ములుగు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌తినిధి, మంత్రి సీత‌క్క‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌ల‌తో క‌లిసి పలు మార్లు ప‌ర్య‌వేక్షిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌గు సూచ‌న‌లు ఇస్తున్నామ‌ని తెలిపారు.

Also Read: త్వరలో 850 పోస్టుల భర్తీ చేస్తాం.. మంత్రి కీలక ప్రకటన

Advertisement

ఈనెల 18 వ తేదీన మేడారం ఆధునీక‌ర‌ణ ప‌నులు ప్రారంభించేందుకు.. గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో స‌హా శాస‌న‌స‌భ‌, శాస‌న మండ‌లి స‌భ్యుల‌ను, మంత్రులు, స్పీక‌ర్‌ల‌ను ఆహ్వానిస్తామ‌ని మంత్రి పొంగులేటి వెల్ల‌డించారు.

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×