E-Paper
Advertisement

Medchal: మేడ్చల్ బస్టాండ్‌కి వెళ్లాలంటే ముక్కు మూయాల్సిందే.. ఎందుకో తెలుసా..!

Medchal: మేడ్చల్ బస్టాండ్‌కి వెళ్లాలంటే ముక్కు మూయాల్సిందే.. ఎందుకో తెలుసా..!
Advertisement

Medchal: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్–కుత్బుల్లాపూర్ జోన్‌లోని మేడ్చల్ సర్కిల్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మేడ్చల్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌లో విలీనమై అప్‌గ్రేడ్ అయిన తర్వాత సౌకర్యాలు మెరుగుపడాల్సి ఉండగా, మౌలిక వసతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి, పూడూరు–కిష్టాపూర్ డివిజన్లు ఉన్నాయి. ముఖ్యంగా మేడ్చల్, గుండ్లపోచంపల్లి డివిజన్లలోని అధిక భాగం ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లోని తమా నగర్, డీఎల్‌ఎఫ్ వెంచర్, ఎంఆర్‌ఆర్ కాలనీ, బాలాజీనగర్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

అప్‌గ్రేడ్ అయినా.. సౌకర్యాలు నిల్..

మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలను మూడు డివిజన్లుగా విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. సాధారణంగా ప్రాంతం అప్‌గ్రేడ్ అయితే నిధులు పెరిగి, సౌకర్యాలు మెరుగుపడాలి. కానీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారినప్పుడు సౌకర్యాలు మెరుగుపడగా, ఇప్పుడు ధ్వంసమైన రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్ రోడ్డు నంబర్–1లో చిన్నపాటి వర్షం కురిసినా పై ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు డ్రైనేజీ నీరు వచ్చి రోడ్డుపై నిలిచిపోతోంది. గురు, శుక్రవార శనివారాల్లో కురిసిన వర్షానికి రోడ్డు మొత్తం నీటితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పొంగిపొర్లుతున్న డ్రైనేజీ..

Advertisement

డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ నిండిపోవడంతో మురుగు నీరు రోడ్డుపైకి వస్తోంది. మేడ్చల్ బస్టాండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్‌ను వినియోగిస్తుండగా, చుట్టూ పొంగిపొర్లుతున్న డ్రైనేజీ కారణంగా దుర్వాసన, ఈగలు, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రంథాలయం రోడ్డులో పలు మ్యాన్‌హోల్స్ మూతలు సరిగా లేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మేడ్చల్ రోడ్ల దుస్థితిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు గతంలో రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. వినాయక్‌నగర్, గ్రంథాలయం రోడ్డు మాత్రమే కాకుండా చంద్రానగర్, ఉమానగర్, వెంకట్రామయ్య కాలనీ, బాలాజీనగర్, కిందిబస్తీతో పాటు గుండ్లపోచంపల్లి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

Also read: రూ.3వేలలోపు బెస్ట్ ఫిట్‌నెస్ వాచ్ కావాలా? దీని కంటే బెస్ట్ ఉండదు

నిధులు సరే.. సౌకర్యాలేవి?

Advertisement

మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇటీవల మూడు డివిజన్ల అభివృద్ధి కోసం రూ.3 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ప్రకటించారు. ఆ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కనిపించడం లేదని ప్రజలు, స్థానిక నాయకులు అంటున్నారు. కార్పొరేషన్‌లో విలీనమైన తర్వాత నిధులు పెరిగి మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సి ఉండగా, ఇలాంటి దయనీయ పరిస్థితి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

సమస్యకు పరిష్కారం కావాలి..

వినాయక్‌నగర్ రోడ్డు నంబర్–1లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి. కొద్దిపాటి వర్షానికే పై ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు వరదలా వచ్చి సిమెంట్ రోడ్డుపై నిలిచిపోతోంది. దీంతో పాదచారులతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నివాసితులు, వ్యాపారులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ రోడ్డును ప్రతిరోజూ వేలాది మంది వినియోగిస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుడు మండల రవికుమార్ కోరారు.

Also read: ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

Related News

తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?

పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వరంగల్‌కు కేటీఆర్, హరీష్‌రావు

భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 15 షాపులు, నల్గొండ జిల్లాలో ఘటన

ఎవరికి తల వంచం.. ఎవరి ఫేవర్ తీసుకోం: ‘బిగ్ టీవీ’ గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డి

Jurala Inflow: జూరాల ప్రాజెక్టుకు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. 8 గేట్లు ఎత్తివేత!

నెక్లెస్ రోడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ..!

ఆయిల్ ఫెడ్ ఆఫీస్‌లో.. ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి తుమ్మల బిగ్ షాక్!

Big Stories

Advertisement
×