BigTV English

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Mohan Babu.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్న మోహన్ బాబు (Mohan Babu) తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ కల్తీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక నోట్ వదిలారు. ప్రస్తుతం ఈ నోట్ రకరకాల అనుమానాలను క్రియేట్ చేయడమే కాదు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కూడా.. ముఖ్యంగా మోహన్ బాబు విడుదల చేసిన ఈ నోట్ ప్రకాష్ రాజ్ పై కోపంతోనా లేక వైసీపీకి దూరమై, టీడీపీకి చేరువ అవ్వడానికి ఇలాంటి నోట్ వదిలారా అంటూ నెటిజన్స్ సైతం ప్రశ్నిస్తున్నారు.


లడ్డూ కల్తీపై అసహనం వ్యక్తం చేసిన మోహన్ బాబు..

అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీవారి లడ్డూ కల్తీపై తాజాగా మోహన్ బాబు స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే స్వచ్ఛమైన ఆవు నెయ్యి లో దాదాపు మూడు నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా నేను తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు నిత్యం భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాము. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం అత్యంత ఘోరం, నీచాతి నీచం, హేయం , అరాచకం, నికృష్టం, ఘోరాతి ఘోరం.. ఇదేగాని నిజమైతే నేరస్తులను కఠినంగా శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు మోహన్ బాబు.


నక్క బుద్ధి చూపించారంటూ నెటిజన్స్ ఫైర్..

Mohan Babu: In the name of Laddu, the fox's mind is exposed.. Is all this to catch the CM?
Mohan Babu: In the name of Laddu, the fox’s mind is exposed.. Is all this to catch the CM?

ఇకపోతే మోహన్ బాబు వదిలిన ఈ నోట్ చూసిన తర్వాత చాలామంది లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా ఎలక్షన్స్ సమయంలో ప్రకాష్ రాజ్ తో మొదలైన గొడవ ఎలక్షన్స్ ముగిసాక పూర్తయింది. కానీ దానిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల లడ్డూ విషయంలో రాజకీయం చేయొద్దని, మత కల్లోలను సృష్టించద్దని , నిందితులను శిక్షించాలి అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ వేడుకున్నారు. అయితే ఇదే విషయాన్ని రీ కోట్ చేస్తూ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ను కార్నర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు అండగా కామెంట్లు చేశారు. ఇక దీనికి తోడు ఇప్పుడు మోహన్ బాబు వైసీపీకి దూరం అవడం కోసం అలాగే టీడీపీ కి దగ్గర అవడం కోసం ఇలాంటి నోట్ వదిలారా..? మొత్తానికి నక్క బుద్ధి చూపించారుగా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో కొనసాగి , వైసీపీ కి వెన్నుదండగా నిలిచిన మోహన్ బాబు ఇలా పార్టీలో లొసగులు ఏర్పడడంతో టిడిపి చెంతకు చేరే ప్రయత్నంలో భాగంగా నా మిత్రుడు, నా స్నేహితుడు అంటూ అంటూ కామెంట్లు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్స్. మరి ఏ ఉద్దేశంతో మోహన్ బాబు ఈ నోట్ వదిలారో తెలియదు కానీ ఈ విషయాలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×