E-Paper
Advertisement

నేను పార్టీ మార‌డానికి కార‌ణం రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి కీల‌క‌ వ్యాఖ్య‌లు

నేను పార్టీ మార‌డానికి కార‌ణం రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి కీల‌క‌ వ్యాఖ్య‌లు
Advertisement

MLC Jeevan Reddy: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ అయిన అనంతరం తన రాజకీయ నిర్ణయంపై ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తాను పార్టీ మారడానికి గల కారణాలను బిగ్ టీవీతో పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంచి చేసినప్పుడు ముఖ్యమంత్రికి ఎలాగైతే పేరు వస్తుందో, ఆశించిన ఫలితాలను అందించలేనప్పుడు వచ్చే అపవాదును కూడా ఆయనే భరించాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎందరో దిగ్గజ ముఖ్యమంత్రుల సరసన పనిచేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డి, వర్తమాన రాజకీయ పరిస్థితులపై తనదైన విశ్లేషణను మీడియా ముందు ఉంచారు.

Advertisement

“కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా శేషజీవితాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనతో కలిసి సాగించాలని నిర్ణయించుకున్నాను.” అని జీవన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు తాను ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, చంద్రబాబు వంటి ఉద్ధండులైన ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశానని, కానీ కేసీఆర్ పదేళ్ల పాలన తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమని కొనియాడారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన తాను, ఆడబిడ్డల కోసం ప్రతిపాదించిన తులం బంగారం పథకం నేటికీ ఆచరణకు నోచుకోకపోవడంపై జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా నూట పదహారు అందిస్తుంటే, మనం అంతకంటే ఎక్కువగా ఇస్తామని ఆశ కల్పించాం. కానీ అధికారంలోకి వచ్చాక అదనపు లక్ష రూపాయలు గానీ, తులం బంగారం గానీ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది.” అని ఆయన విమర్శించారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం ఆడబిడ్డలను వంచించడమేనని మండిపడ్డారు.

Advertisement

ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ. 200 గా ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ అధికారంలోకి రాగానే ఐదు రెట్లు పెంచి రూ. 1000 చేశారని, ఆ తర్వాత దానిని రూ. 2000కు పెంచారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. “మీరు రూ. 4000 ఇస్తామని చెప్పి ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదు.” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బీడీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత కేసీఆర్ దేనని, ఆ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.

గిరిజనుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ఆ రిజర్వేషన్లను 6% నుండి 10%కి పెంచి అమలు చేశారని కొనియాడారు. నేడు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులు ఈ 10 శాతం రిజర్వేషన్ల ఫలాలను అందుకుంటున్నారని తెలిపారు. సంక్షేమం, సామాజిక న్యాయం కేవలం బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శిస్తూ జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

Read Also: ఉత్కంఠకు తెర దించుతూ.. హస్తం వీడి కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×