Hyderabad: హైదరాబాద్‌లోని హత్య గురైన మాజీ ఐపీఎస్ వినయ్‌రంజన్ భార్య తనూజ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు కాస్త పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ గుర్తించారు. ఆమె నేపాల్‌కు చెందిన మహిళ. దీంతో తీగలాడిగే డొంక కదులుతోంది.
హైదరాబాద్ సిటీలో ఇళ్లు, అపార్టుమెంట్లలో హత్యల వెనుక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాని నిందితులు ఎక్కువగా నేపాల్‌కు చెందినవారు ఉంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో హత్యకు గురైన మాజీ ఐపీఎస్ వినయ్‌రంజన్ భార్య తనూజ హత్య కేసులో నిందితులు నేపాల్‌కు చెందినవారు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు కాస్త పురోగతి సాధించారు.
ఈ కేసు చేధించేందుకు ఆరు నెలలుగా ప్రత్యేక బృందాలు నేపాల్‌లోనూ నిఘా వేశాయి. ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ గుర్తించాయి. ఆచూకీ లభించడంతో ఆమెని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఎక్కడ అదుపులోకి తీసుకున్నారో పోలీసులు వెల్లడించలేదు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ అధికారులు, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నేరానికి పాల్పడిన నేపాలీ ముఠా చాకచక్యంగా పోలీసుల కళ్లు గప్పి బీహార్ మీదుగా నేపాల్ చేరింది. నిందితురాలు కల్పన.. నేపాల్‌కు చేరినట్టు ఆధారాలు లభించటంతో ఓ టీమ్‌ని అక్కడకు పంపారు. రెండు నెలలుగా అక్కడే మకాం వేసిన సదరు టీమ్, ఆచూకీ కనిపెట్టారు. ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆమెని అదుపులోకి తీసుకోవటం తొలుత పోలీసులకు కాస్త కష్టంగా మారింది. ఆ తర్వాత ఆమెని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పుడు కల్పన ఆచూకీ కనుగొన్నారు.
నిందితుల్లో ఒకరు 29 ఏళ్ల సునీల్ బహదూర్‌ఔజీని అరెస్టు చేసిన పోలీసులు, జైలుకు పంపారు. రిటైర్ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ తన తల్లికి సంరక్షకురాలిగా నేపాల్‌కు చెందిన కల్పనను పనికి చేర్చుకున్నారు. అయితే నిందితులు ఇంట్లో నగదు, నగలు దొంగలించేందుకు కల్పనను వినియోగించుకున్నారు. విజయ్ రంజన్ బెంగళూరు వెళ్లడాన్ని గమనించిన వాళ్లు, మే 7న అర్ధరాత్రి దాటాక తనూజను హత్య చేశారు.
ఆ తర్వాత ఇంట్లోని నగలు, నగదు తీసుకుని అక్కడిని పరారయ్యారు. హత్య తర్వాత నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు ఎక్కినట్టు తేలింది. ఆ తర్వాత ఆ బృందం వేర్వేరు బృందాలుగా విడిపోయిందని, కొందరు భోపాల్, మరికొందరు ముంబైకి వెళ్లినట్టు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఈ నేరంలో కనీసం నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!
గతంలో నిందితులుగా ఉన్న కొందరి నుంచి సమాచారాన్ని సేకరించారు అధికారులు. ఇలాంటి నేరాలలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న నెట్‌వర్క్ గురించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ బృందం వేర్వేరు విభాగాలుగా పని చేస్తుందని గుర్తించారు. నేరాలకు పాల్పడటానికి ఆ టీమ్‌లోని సభ్యులు ఇంట్లో పనివాళ్లు చేరుతారని అధికారులు చెబుతున్నారు.