E-Paper
Advertisement

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?
Advertisement

Nalgonda Constable: నల్గొండ జిల్లా కేంద్రంలోని మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తన వ్యవహారాన్ని గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక విషయంలో..

మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కానిస్టేబుల్ సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక విషయంలో కానిస్టేబుల్ సత్యనారాయణ వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కానిస్టేబుల్ సత్యనారాయణను విధుల నుంచి సస్పెండ్ చేశారు. చట్టం ముందు అంత సమానులేనని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

Advertisement

Also Read: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

ఫోక్సో యాక్ట్..

సదరు సత్యనారాయణ కానిస్టేబుల్ 2024 లోనూ ఇదే తరహా కేసు నమోదు కాగా విధుల నుంచి రిమూవ్ కాకుండా కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులను కలిసి ప్రాధేయపడటంతో పాటు రాజకీయంగా ప్రభావితం చూపి ఆ కేసు నుంచి బయటపడినట్లు సమాచారం తాజాగా మైనర్ బాలిక పట్ల వ్యవహరించిన తీరుతో అతనిపై ఫోక్సో యాక్ట్ కాగా విధుల నుంచి సస్పెండ్ కావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Also read: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

Related News

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

Big Stories

Advertisement
×