BigTV English

Nalgonda News: మాటలు కలిపి, అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆ యువతి ఏం చేసిందంటే?

Nalgonda News: మాటలు కలిపి, అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆ యువతి ఏం చేసిందంటే?

Nalgonda News: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి చెంప ఛళ్లుమనిపించింది ఓ యువతి. ఆ యువతి ధైర్యానికి అందరూ సూపర్ అంటూ కితాబిస్తున్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, వారి పట్ల యువతులు ఇదే రీతిలో స్పందిస్తే, ఇలాంటి ఘటనలు మరెక్కడ జరగవని స్థానికులు అన్నారు. ఇంతకు ఏం జరిగిందంటే?


నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఓ యువతి ఇడ్లీ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఆ యువతి వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిన వ్యక్తి మాటలు కలిపి, అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన యువతి అలర్ట్ అయింది. కాసేపు అలాగే ఉండి, ఇంకా శృతి మించితే అప్పుడు చూద్దాం అసలు సంగతని గమనిస్తోంది. అంతలోనే సదరు వ్యక్తి లైన్ దాటాడు. ఇక అంతే తన పవర్ చూపించింది ఆ యువతి.

తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప ఛళ్లుమనిపించింది. అంతేకాదు అతడి చొక్కా పట్టుకొని, నీ ఇంట్లో నాలాంటి కూతురు లేదా అంటూ ప్రశ్నిస్తూ, తన ప్రతాపం చూపింది. ఇక చేసేదేమి లేక ఆ వ్యక్తి, సారీ సారీ అంటూ చెప్పడం మొదలు పెట్టాడు. సదరు యువతి మాత్రం వదిలేదేలే అంటూ సీరియస్ అయింది. అప్పుడే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో అంటూ కేకలు వేసి, ఎలాగోలా ఆ యువతి బారి నుండి అతడిని రక్షించారు.


Also Read: Namo Bharat Train: అందుబాటులోకి తొలి నమో భారత్ రైలు, జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ!

ఈ తతంగమంతా ఎవరో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టుకొని చెంప ఛళ్లుమనిపించిన యువతిని అందరూ అభినందిస్తున్నారు. ఈ యువతి మాదిరిగా ధైర్యం కోల్పోకుండ, ఇలాంటి చీడ పురుగుల భరతం పట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. చివరగా ఆ యువతి పేరు చెప్పలేదు కదా.. ఆ ధైర్యశాలి పేరు ఝాన్సీ రాణి. పేరుకు తగినట్లుగా ప్రతాపం చూపింది కదా!

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×