Kalki 2898 AD: ఒక సినిమా ఒకే విధంగా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తుందని గ్యారెంటీ లేదు. కొన్ని భాషల్లో అదే సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించి హిట్ సాధిస్తే.. ఇతర భాషల్లో ఫ్లాప్ టాక్ కూడా సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అలా ఇప్పటివరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు జరిగింది. అన్ని భాషల్లో ఒకే విధంగా ఆదరణ సంపాదించుకున్న చిత్రాలు చాలా అరుదు. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’కి కూడా అదే సమస్య ఎదురయ్యింది. ఈ మూవీ ఇండియాలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. కలెక్షన్స్ విషయంలో దూసుకుపోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ కూడా అందుకుంది. కానీ పరదేశంలో మాత్రం ‘కల్కి 2898 ఏడీ’కి చేదు అనుభవం ఎదురవుతోంది.
కొత్తగా రిలీజ్
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ (Prabhas)కు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తను నటించే ప్రతీ సినిమా ఫారిన్ భాషల్లో కూడా డబ్ అయ్యి విడుదలవుతోంది. చాలావరకు తన సినిమాలు వేరే ఫారిన్ భాషల్లో కూడా మంచి విజయాన్ని సాధించాయి. అదే విధంగా 2024లో ఇండియాలో విడుదలయిన ‘కల్కి 2898 ఏడీ’ని కూడా ఫారిన్ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇండియన్ భాషల్లో విడుదల ఒకేసారి ఉండడంతో అప్పుడే ఫారిన్ భాషల్లో విడుదల కష్టమని మేకర్స్ వెనకడుగు వేశారు. ఇక 2025 ప్రారంభంలోనే ఈ మూవీ జపాన్‌లో విడుదలయ్యింది. అక్కడ మేకర్స్‌కు షాకిచ్చే విధంగా మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి.
Also Read: అక్షయ్ కుమార్‌పై ట్రోల్స్.. అయినా ఇలాగే ఉంటానంటున్న హీరో, ఎందుకంత మొండితనం.?
కలెక్షన్స్ ఓకే
ఇటీవల జపాన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ విడుదల కాగా దీని ఓపెనింగ్‌కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. జపాన్‌లో మొదటిరోజే ఈ మూవీకి 8 మిలియన్ యెన్ వచ్చాయి. అంటే అమెరికన్ డాలర్స్‌లో 50 వేలు. కలెక్షన్స్ ఎలా వచ్చినా కూడా సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలాగే మిక్స్‌డ్ రివ్యూలు వస్తే ఈ మూవీ ఎక్కువరోజులు థియేటర్లలో రావడం అనేది చాలా కష్టమని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు జపాన్‌లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ సాధించింది. మొదటిరోజు ఈ మూవీకి 9.14 మిలియన్ యెన్ వచ్చాయి.
యావరేజ్ అయ్యింది
జపాన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఓపెనింగ్ డే కలెక్షన్స్.. ‘సలార్’, ‘జవాన్’ను దాటేసింది. అయినా కూడా రేటింగ్ విషయంలో ఈ మూవీ కాస్త వెనకబడే ఉంది. జపాన్‌లో ‘కల్కి 2898 ఏడీ’కి 3/5 రేటింగ్ మాత్రమే వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ లాంటి సినిమాలకు 4 కంటే ఎక్కువ రేటింగ్ లభించింది. దీంతో ఈ సినిమా అక్కడ యావరేజ్ అయ్యిందని అర్థమవుతోంది. అంటే ఇండియాలో ఈ మూవీకి ఏ రేంజ్‌లో అయితే ఆదరణ లభించిందో జపాన్‌లో ఆ రేంజ్‌లో ప్రేక్షకులను మరిపించలేకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జపాన్‌లో హాలిడే సీజన్ నడుస్తోంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్స్‌కు ఏ సమస్య లేదు కానీ మౌత్ టాక్ మాత్రం కొంతవరకే పరిమితవుతుందని తెలుస్తోంది.