BigTV English

Renudesai: 22 ఏళ్ల తర్వాత అలాంటి పని.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్..!

Renudesai: 22 ఏళ్ల తర్వాత అలాంటి పని.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్..!

Renudesai: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు దప్పించుకుంది రేణూ దేశాయ్(Renu Desai). ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేస్తూ మంచి పేరు దక్కించుకుంది. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను ప్రేమించి పెళ్లికి ముందే ఒక కొడుకుకు జన్మనిచ్చిన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక దాంతో ఇండస్ట్రీకి దూరమైన రేణూ దేశాయ్ పిల్లలిద్దరిని తీసుకొని, ముంబైకి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. అక్కడే పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వారి భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.


22 ఏళ్ల తర్వాత అలాంటి పని చేశానంటూ పోస్ట్..

ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది రేణూ దేశాయ్. అందులో ఒక యాడ్ కి ఫోజులిచ్చిన ఫోటోని ఆమె షేర్ చేస్తూ.. “దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ నేను యాడ్ షూటింగ్ కి వెళ్లాను. నేను యాడ్ షూటింగ్లను ఎంతగా ఇష్టపడతానో అంతే సంతోషంగా ఫీల్ అవుతాను కూడా.. నాకు ఫుల్ మూవీ చేయాలని ఆసక్తి లేదు. ఎప్పుడూ కూడా రాదు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు నటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిగా సినిమాలకు ముగింపు ఇచ్చేసాను” అంటూ ఒక క్యాప్షన్ జోడించింది. ఇకపోతే రేణూ దేశాయ్ తాజాగా ‘ఐశ్వర్య’ అనే బ్రాండ్ కు సంబంధించి అల్పాహారాలను ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై నెటిజన్లు కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.


శాశ్వతంగా ఇండస్ట్రీకి ముగింపు పలికిన రేణు దేశాయ్..

ఇదిలా ఉండగా ఎప్పుడో ఇండస్ట్రీకి దూరమైన రేణూ దేశాయ్.. మొన్నా మధ్య రవితేజ (Raviteja) హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సరైన క్యారెక్టర్ వస్తే మళ్లీ చేయడానికి సిద్ధమే అంటూ గతంలో రేణు దేశాయ్ తెలిపింది. కానీ ఇప్పుడు శాశ్వతంగా ముగింపు ఇచ్చేసానని చెప్పడంతో అభిమానులు కాస్త ఫీలవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం తన కూతురు ఆధ్య పేరు మీద యానిమల్ ట్రస్ట్ కూడా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడమే కాకుండా తనకు తోచినంత సహాయం చేస్తూ నెటిజన్స్ ని కూడా సహాయం అడుగుతూ ఉంటుంది. ఇక అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతోంది.

రేణూ దేశాయ్ సినిమాలు..

రేణూ దేశాయ్ విషయానికి వస్తే.. బద్రి, జానీ వంటి సినిమాలలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సరసన నటించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది. అదే సమయంలోనే ఆయనతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకొని, ఆ తర్వాత కొంతకాలానికి విడాకులు ఇచ్చి ఇప్పుడు ఒంటరిగా పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తోంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by renu desai (@renuudesai)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×