PM Inaugurates Namo Bharat Trains: భారతీయ రైల్వే వ్యవస్థ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు మరో హైస్పీడ్ రైలు అందుబాటులోకి వచ్చింది. సాహిబాబాద్ నుంచి దుహై మధ్య నడిచే నమో భారత్ రైళ్లను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోనే తొలి రాపిడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఇదే కావడం విశేషం. నమో భారత్ కారిడార్ తొలి దశలో భాగంగా ఢిల్లీ- ఘజియాబాద్ మార్గంలో ఈ రైళ్లు నడవనున్నాయి. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో నడిచే ఈ రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నమో భారత్ రైల్వే కారిడార్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.
6 కిలో మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం
నమో భారత్ రైలును ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని వసుంధర సెక్టార్ లో నిర్మించిన స్టేషన్ లో మోడీ జెండా ఊపి ప్రారంభించారు. సాహిబాబాద్-ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్‌టీఎస్(RRTS) కారిడార్ లో 13 కిలో మీటర్ల సెక్షన్ ను ఆయన ప్రారంభించారు. ఈ 13 కిలో మీటర్ల విభాగంలో 6 కిలో మీటర్లు భూగర్భంలోనే నడవనుంది. నమో భారత్ రైల్వే స్టేషన్లను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లకు అనుసంధానం అయ్యేలా నిర్మించారు. ఇక హిండన్ ఎయిర్ బేస్ నుంచి సాహిబాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ, ఈ నమో భారత్ మెట్రో లైన్ ను జాతికి అంకితం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు నమో భారత్ రైల్లో ప్రయాణించారు. చిన్నారులు వేసిన పెయింటింగ్స్ ను చూసి అభినందించారు.
प्रधानमंत्री @narendramodi ने साहिबाबाद आरआरटीएस स्टेशन से न्यू अशोक नगर आरआरटीएस स्टेशन तक नमो भारत ट्रेन का सफर किया#NamoBharat pic.twitter.com/oIHSaiLT7o
— पीआईबी हिंदी (@PIBHindi) January 5, 2025
ఢిల్లీ, ఆల్వార్, పానిపట్, మీరట్ మధ్య అనుసంధానం
ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు ద్వారా మొదటి దశలో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణం 12 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ కారిడార్ పొడవు 82 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో 14 కిలో మీటర్లు ఢిల్లీలో ఉండగా, 68 కిలో మీటర్లు ఉత్తరప్రదేశ్ లో ఉంది. అటు సుమారు 1,200 కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీ మెట్రో ఫేజ్ 4లోని జనక్ పురి-కృష్ణా పర్క్ మధ్య 2.8 కిలో మీటర్ల విస్తరణను కూడా మోడీ ప్రారంభించారు. ఫేస్ 4లో ఢిల్లీ నుంచి పానిపట్, ఆల్వార్ వరకు కారిడార్ నిర్మాణాలు జరగనున్నాయి. ఈ కారిడార్లు ఆల్వార్, పానిపట్, మీరట్ నగరాలను ఢిల్లీతో అనుసంధానం చేయనున్నాయి.
నమో భారత్ రైలు ప్రత్యేకత
ఇక తాజాగా ప్రారంభం అయిన నమో భారత్ రైలు పూర్తి ఏసీ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. కూర్చునేందుకు సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం ఉంటుంది. లగేజీ పెట్టుకునేందుకు లగేజ్ ర్యాక్ లు ఉంటాయి. సెక్యూరిటీకోసం సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ వ్యవస్థ ఉంటుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు అందుబాటులో ఉంది. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. ఈ రైళ్లు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.
Read Also: స్టేషన్ కు వెళ్లకుండానే జనరల్ టికెట్ బుకింగ్, సింఫుల్ గా ఈ యాప్ లో ట్రై చేయండి!