E-Paper
Advertisement

Ward Administration: గద్వాల్‌లో రోజురోజుకు పెరుగుతున్న కబ్జాల పర్వం

Ward Administration: గద్వాల్‌లో రోజురోజుకు పెరుగుతున్న కబ్జాల పర్వం

Ward Administration: స్వేచ్ఛ బ్యూరో: మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత గత సంవత్సరం పాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఈ సంవత్సరం పాటు పురపాలక పాలకవర్గం లేకపోవడం అధికారులు పట్టించుకోకపోవడంతో వార్డు అధికారులపై పర్యవేక్షణ కరువైంది. ప్రతి వార్డుకో అధికారిని నియమించినా, క్షేత్రస్థాయిలో వీరు కనిపీయక వార్డులలో మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలలో జాబ్ కార్డును మర్చిపోయి చాలా వరకు కార్యాలయానికి పరిమితం అవుతుండడంతో వార్డుల్లో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఇటీవల నూతన పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో వారి పనితీరు మెరుగవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.ముఖ్యంగా పట్టణాలలో మౌలిక వసతుల కల్పన లేక వార్డులలో ఇళ్ల సమూహాల మధ్య డ్రైనేజీ, రవాణా కోసం సిసి రోడ్లు, వీధిలైట్ల నిర్వహణ తాగునీరు రాక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పారిశుద్ధ్య ప్రణాళిక..

వార్డు అధికారులు మున్సిపాలిటీలలో వార్డు స్థాయి పారిశుద్ధ్య ప్రణాళిక ఇంటింటికి చెత్త సేకరణ వ్యర్థాల నిర్వహణను పక్కాగా అమలు అయ్యేలా చూడాలి. పారిశుద్ధ్య కార్మికులు చేపట్టే పనులు పర్యవేక్షించడం, వారికి విధులు అప్పగించడం చేయాలి. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ఇంటి పన్నులు వసూలు, వాటి పురోగతిని సంబంధిత అధికారులకు తెలపాలి. రోడ్లు మురుగు కాలువల పరిశుభ్రత ఉండేలా చూడడం ద్వారా అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి. పబ్లిక్ ప్రైవేట్ మార్కెట్లలో స్లాటర్ హౌస్ మాంసం దుకాణాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా పరిశీలించాలి. ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ బక్కగా చేపట్టేలా పర్యవేక్షణ చేయాలి. నర్సరీలో మొక్కల పెంపకం వంటి పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు, పార్కుల నిర్వహణ,నాటిన వాటిలో కనీసం 25% మొక్కలు బతికేలా చూడటం, వీధి దీపాలు నీటి సరఫరాను పర్యవేక్షించడం వీరి బాధ్యతలు.

Also Read: HMWSSB: బిగ్ అలర్ట్.. హైద‌రాబాద్ న‌గ‌రానికి రెండు రోజులు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

పనులన్నీ అస్తవ్యస్తం..

వార్డు పరిధిలో పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి పరిశుద్ధ నిర్వహణ అంతంత మాత్రం గానే మారింది కొన్ని కాలనీలలో నాలుగైదు రోజులకు ఒకసారి కూడా చెత్త సేకరణ చేపట్టడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీధులలో వీధి కుక్కల బెడద ఉండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. డబ్బులు ఇస్తే తప్ప కొందరు ఔట్ సోర్సింగ్ సేవలు సిబ్బంది పనులు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికీ అడ్డు కట్ట పడాలన్న మున్సిపల్ కు ఆదాయం సక్రమంగా వసూలు కావాలన్నా వాడు అధికారుల పాత్ర ఎంతో కీలకం. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని బీమ్ నగర్ లో సాయి కృప హాస్పిటల్ సమీపంలో ఇంటి యజమాని డ్రైనేజీ కాలువను ఆక్రమించి ఆ కాల్వపైనే షాపులను నిర్మించాడు. మరో ఇంటి యజమాని పాత డ్రైనేజీ పూడ్చివేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంటి ముందర ఉన్న పది ఫీట్ల స్థలాన్ని ఆక్రమించుకోవడానికి పాత డ్రైనేజీ కాలువను పూడ్చివేసే కొత్త డ్రైనేజీ నిర్మాణం చేపట్టాడు.

అధికారులను సమన్వయం

ఇంటిని నిర్మాణం కోసం వృధాగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనువైన ప్లాటుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా అనేకచోట్ల 10 శాతం స్థలాలలో కబ్జాలకు పాల్పడుతున్న వార్డు అధికారుల పాత్ర నామమాత్రంగా మారుతోంది. ప్రధాన రహదారుల గుండా వీధి వ్యాపారాలు పుట్టగొడుగుల వెలుస్తూ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నావాటిపై చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వాహనదారులను వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాలోని మున్సిపాలిటీలలో ఇటీవల కొలువుదీరిన పాలకవర్గాలు అధికారులను సమన్వయం చేసుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఒత్తిళ్లకు అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి ప్రభుత్వ నిబంధన మేరకు అనుమతులు ఇచ్చి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకొని మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో వార్డు సభ్యుల పాత్ర కీలకం కావాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.

Also Read: Tips For Success: విజేతగా నిలవాలంటే.. మీ మెదడుకు ఈ శిక్షణ తప్పనిసరి!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×