BigTV English

KTR: అసలు వదిలి కొసరు.. ఇదేంటి కేటీఆర్?

KTR: అసలు వదిలి కొసరు.. ఇదేంటి కేటీఆర్?

KTR: అన్నీ పనులు వదిలి.. ఆ ఒక్కటి పూర్తి చేశాడని అంటుంటారు పెద్దలు. ఈ సామెత సాధారణంగా ఎవరైనా చేయాల్సిన పని చేయకుండా, ఇతరుల పనిలో జోక్యం చేసుకున్నా, అనవసర విషయాల్లో వేలు పెట్టినా పెద్దలు ఇదే చెబుతుంటారు. సేమ్ టు సేమ్ అదే పని చేశారు ఓ నేత. పది మందికి ఉపయోగపడే పని చేసేందుకు సాధారణంగా రాజకీయ నేతలు అడుగులు వేస్తుంటారు. అది కామన్ కూడ.


ఎందుకంటే రాజకీయ క్షేత్రంలోకి వచ్చేది ప్రజాసేవ కోసం అంటుంటారు నేతలు. కానీ ఈ నేత మాత్రం.. అసలు పని వదిలి కొసరు పని పట్టుకున్నారు అంటున్నారు నెటిజన్స్. ఇంతకు అంతలా కొసరు పట్టుకున్న నేత ఎవరనే అనుకుంటున్నారా.. ఆయనే కేటీఆర్. ఈ మాటలు అంటున్నది మాత్రం సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్.

మాజీ మంత్రి కేటీఆర్ అంటే తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయి గల వ్యక్తి. గతంలో మంత్రిగా భాద్యతలు నిర్వర్తించిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలో సెకండరీ లీడర్ అంటుంటారు క్యాడర్. అయితే ఒక్క విషయంలో కేటీఆర్ స్పందించిన తీరు పట్ల, ఇప్పుడు నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అసలే తెలంగాణ అసెంబ్లీ వేదికగా కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.


ఈ సర్వే విజయవంతం కావడంతో యావత్ భారత్.. తెలంగాణ వైపు తొంగి చూస్తోంది. కేటీఆర్ మాత్రం ఇదంతా మరచి.. ఒక్క విషయంలో తొందరపడ్డారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన హోదా మరచి ఇలా కేటీఆర్ ట్వీట్ చేయడం ఏమిటని కూడ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్స్. ఇంతకు కేటీఆర్ చేసిన ఆ ఒక్క ట్వీట్ వెనుక కథ ఏమిటంటే..

గత రెండు రోజులుగా లావణ్య, మస్తాన్ సాయికి సంబంధించి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్ ను లావణ్య తీసుకొని, మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసింది. దీనితో అసలు విషయాలను తెలుసుకున్న పోలీసులు, మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ఎందరో యువతులను బెదిరించి వీడియోలు తీసినట్లు, మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో మస్తాన్ సాయి వలలో చిక్కుకున్న యువతులను రక్షించాల్సిన భాద్యతను పోలీసులు తీసుకున్నారు. అయితే ఇదే విషయాన్ని ‘బిగ్’ టీవీ వార్తల రూపంలో ప్రసారం చేసింది. ఉన్నది ఉన్నట్లు.. నిజాన్ని నిర్భయంగా ‘బిగ్’ టీవీ పలు కథనాలను ప్రసారం చేస్తోంది. అయితే ఎవరి మనోభావాలు కించపరచకుండా, మస్తాన్ సాయి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి అండగా నిలిచింది ‘బిగ్’ టీవీ. భాద్యతాయుతంగా వ్యవహరిస్తూ.. ఇటువంటి మోసాలకు మరెవరూ బలికాకుండ, బిగ్ టీవీ వ్యవహరించింది.

కానీ ఒకరు మాత్రం.. ‘బిగ్’ టీవీ హార్డ్ డిస్క్ వీడియోలను ప్రసారం చేసిందంటూ.. ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండ, చర్యలు తీసుకోవాలన్న కోణంలో ‘బిగ్’ టీవీ కథనాలు ప్రసారం చేసింది. అంతేకానీ ఒకరి హక్కులను భంగం కలిగించేవిధంగా ఎటువంటి వీడియోలను ప్రసారం చేయలేదు. అయితే ఇక్కడే కేటీఆర్.. అసలు పని వదిలి కొసరు పని పట్టుకున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారని టాక్. సదరు మహిళ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేటీఆర్.. ఏకంగా దీనిపై డీజీపీ స్పందించాలని కోరారు. కేటీఆర్ లాంటి ఉన్నత స్థాయి వ్యక్తి.. ఇలాంటి కేసు గురించి స్పందించడం ఏమిటని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇక లావణ్య కేసు విషయంలోకి వెళితే.. గతంలో హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఆమెపై కూడ డ్రగ్స్ సంబంధిత కేసులు నమోదైన విషయం కూడ అప్పుడు తెరమీదికి వచ్చింది. అందులో ఎంత వాస్తవం ఉందో కానీ, అప్పట్లో తెగ వైరల్ గా మారింది. ఇలా ఈ కేసుల పరంపర సాగుతున్నప్పుడే, శేఖర్ భాష తెరమీదికి వచ్చారు.

ఆ తర్వాత మస్తాన్ సాయి వచ్చారు. ఈ వివాదం కేవలం ఒక నలుగురి మధ్య జరుగుతున్న వివాదంగా చెప్పవచ్చు. కానీ తాజాగా మస్తాన్ సాయి నిర్వాకంతో ఎందరో జీవితాలు తెరమీదికి వచ్చాయి. ఈ విషయంలో పోలీసులు వారిపని వారు చేసుకుపోతున్నారు. మీడియా తన పని తాను చేసుకుపోతోంది. ఈ దశలో ఇలాంటి కేసు గురించి ఎవరో చేసిన ట్వీట్ ని, కేటీఆర్ రీట్వీట్ చేయడం విశేషం.

Also Read: Excise Department: బీరు ప్రియులారా.. తస్మాత్ జాగ్రత్త!

ఒక రాజకీయ నేతగా పది మంది ప్రజలకు మంచి చేకూరే విషయంలో కేటీఆర్ స్పందించే ఉంటే బాగుండేదని, ఇటువంటి విషయాల్లో కేటీఆర్ జోక్యం చేసుకోవడం ఏ మాత్రం సబబు కాదంటున్నారు నెటిజన్స్. మొత్తం మీద కేటీఆర్ రీట్వీట్ చేసిన విషయంపై మాత్రం, సోషల్ మీడియా మొత్తం.. మీ స్థాయికి ఇది కరెక్ట్ కాదంటోంది. దీనికి కేటీఆర్ రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.

 

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×